ఇద్దరు అపరిచితులు ఒక పని మీద ఒకే చోట ఒక ఉద్యోగంలో చేరారు.

ఆ చోటు ఒక పర్వతం. దాని పేరే “Brokeback Mountain”.

మెల్లిగా వాళ్ళ మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరిగి ప్రేమించుకున్నారు. అన్ని రకాలుగా కలిసారు. కానీ విధి కలిసి ఉండనివ్వలేదు. దాంతో విడిపోయి విడి విడిగా పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతకడం మొదలు పెట్టారు.

కానీ దానిలో ఒకరికి మళ్ళీ పాత జీవితం గుర్తొచ్చి తన లవర్ ని కలిసి మనం లేచిపోయి కలిసి జీవిద్దాం అని అడిగితే అతను తనకి భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి రాలేనని చెప్తాడు. కావాలంటే అప్పుడప్పుడు దొంగ చాటుగా క్యాంప్ కి వెళ్ళి కలుసుకుందామని అంటాడు. అలాగే కలుస్తూ ఉంటారు.

కానీ ఇతని భార్యకి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం కోసం తెలిసిపోయింది. దాంతో విడాకులు ఇచ్చేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇతను అవతలి వ్యక్తిని మర్చిపోలేక ఒక పోస్ట్ కార్డ్ పంపిస్తే ఆ వ్యక్తి చనిపోయిన కారణంగా మళ్ళీ వెనక్కి పంపేసాం అని రిప్లయ్ ఇస్తారు.

ఇతను ఆ ఊరికి వెళ్ళి అక్కడ తన లవర్ ఇంకా తను ఎప్పుడో కలిసున్నప్పుడు కట్టుకున్న షర్టు జాగ్రత్తగా దాచుకోవడం చూసి తట్టుకోలేక ఆ బట్టలు తెచ్చుకుని తన లవర్ జ్ఞాపకాలతో జీవితాంతం గడుపుతూ ఉంటాడు.

ఇదే ఈ సినిమా కథ.

ఈ కథ ఒక అద్భుతమైన లవ్ స్టొరీ అనిపించింది కదా. అలాగే ఇలాంటి విఫల ప్రేమ కథలతో తెలుగు సినిమా చాలా సినిమాలు తీసింది.

ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళదాం. కథ మొత్తం రాసేస్తున్నా కాబట్టి స్పాయిలర్స్ ఉంటాయ్.

1963 లో Wyoming అనే ఊళ్ళో Aguirre అనే ఒక గొర్రెల యజమాని Ennis (Heath Ledger అదే బ్యాట్ మాన్ సినిమాలో జోకర్), Jack (Jake Gyllenhaal అదే Spider man – far from home సినిమాలో విలన్) అనే ఇద్దరు కుర్రాళ్ళను తన గొర్రెలు కాపలా కాయడం కోసం పెట్టుకుంటాడు. వాళ్ళ పని వేసవి కాలంలో గొర్రెల్ని ఒక కొండ పైకి తీసుకెళ్ళి బాగా మేపి కిందకి తీసుకు రావడం.

ఆ కొండ పేరే మన సినిమా టైటిల్ “Brokeback Mountain”.

ఈ పని కేవలం వేసవి కాలం లో మాత్రమే ఉంటుంది. మిగతా సమయాల్లో ఎక్కడ పడితే అక్కడే గడ్డి దొరుకుతుంది కాబట్టి అవసరం లేదు. 

మెల్లిగా వాళ్ళ మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరిగి ప్రేమించుకున్నారు. అన్ని రకాలుగా కలిసారు.

వేశవి కాలం ముగియడంతో వాళ్ళ జాబ్ కూడా అయిపొయింది. దాంతో ఇద్దరూ ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. 

Ennis తన గర్ల్ ఫ్రెండ్ అల్మా బీర్స్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు కూతుళ్ళని కూడా కంటాడు. 

జాక్ వేరే వేరే పనులు చేస్తూ చివరికి “Rodeo” గా పని చేసే అంటే గుర్రాలని లొంగదీసి ఆడుకునే “Lureen” ని పెళ్ళి చేసుకుంటాడు. ఆమె బాగా డబ్బున్న ఒక బిజినెస్ మాన్ కూతురు. వీళ్ళకి ఒక కొడుకు.

ఒక నాలుగేళ్ళు గడుస్తాయ్. అనుకోకుండా జాక్ ఎన్నిస్ ఉన్న ఊరికి వస్తాడు. చాలా రోజుల తర్వాత చూసుకోవడంతో ఇద్దరూ ముద్దు పెట్టుకుంటారు. అది కాస్తా ఎన్నిస్ గాడి పెళ్ళాం కంట బడుతుంది. కానీ ఏం అనదు, అడగదు.

జాక్ “నువ్వు నీ పెళ్ళాన్ని పిల్లల్ని వదిలెయ్యి, నేను కూడా నా కుటుంబాన్ని వదిలేస్తా. ఇద్దరూ కలిసుందామని” ఎన్నిస్ ని అడుగుతాడు. దానికి ఎన్నిస్ ఒప్పుకోడు. నా కుటుంబం, ముఖ్యంగా నా పిల్లలు ముఖ్యం అంటాడు. కానీ ఇద్దరూ ఫిషింగ్ ట్రిప్స్ పేరుతొ వేరే వేరే ఊళ్లలో కలుస్తూ ఉంటారు. ఈ విషయం ఎన్నిస్ భార్యకి తెలిసి విడాకులు తీసుకుని కొన్నాళ్ళు పోయాక వేరే పెళ్లి చేసుకుంటుంది. పిల్లలు ఆమె దగ్గరే ఉన్నా కూడా ఎన్నిస్ కూడా బాధ్యత తీసుకుంటాడు.

Ennis విడాకులు తీసుకున్న సంగతి Jack కి తెలుస్తుంది. మళ్ళీ వచ్చి ఎలాగా నువ్వు నీ భార్యా విడిపోయారు కదా. మనిద్దరం కలిసుందాం అని అడుగుతాడు. కానీ Ennis ఒప్పుకోడు. తన కూతుళ్ళకి తన అవసరం ఉంది కాబట్టి తను ఎక్కడికీ రాలేను అని చెప్తాడు.

ఈలోగా Jack కి వేరే అబ్బాయితో అఫైర్ ఉందని అనుమానించి Lureen విడిపోతుంది. 

కొన్ని నెలల పాటు Ennis, Jack కలుసుకోవడం కుదరదు. దాంతో Ennis Jack కి ఒక పోస్ట్ కార్డు పంపిస్తాడు. Jack చనిపోయాడు కాబట్టి అది డెలివరి ఇవ్వడం కుదరలేదని తిప్పి పంపేస్తారు. దాంతో  Ennis Jack కి ఫోన్ చేస్తాడు.

Lureen ఫోన్ తీసి ఒక ఐరన్ టైర్ గట్టిగా మొహం మీద తగలడంతో అతను చనిపోయాడని చెప్తుంది. 

Jack ఎలా చనిపోయాడో Lureen చెప్తున్నప్పుడు Ennis ఎవరో Jack మొహం మీద Iron rod తో కొట్టి చంపేసినట్టు ఊహించుకుంటాడు. కారణం Ennis చిన్నప్పుడు ఇతని తండ్రి “హోమోసెక్సువల్” అయిన ఒకబ్బాయిని టార్చర్ పెట్టి చంపేసిన శవం ఒకటి చూపిస్తాడు. దాంతో ఇతని మనస్సులో కూడా Jack ని అలా టార్చర్ పెట్టి కొట్టి చంపేసారు అని ఊహించుకుంటాడు.    

Jack బూడిద ఆ Brokeback Mountain లో కలపడం Jack ఆఖరి కోరిక అని Lureen చెప్తుంది. 

Ennis Jack ఊరికి వెళ్ళి అతని తల్లిదండ్రులని కలుస్తాడు. కానీ Jack తండ్రి ఒప్పుకోడు. Jack తల్లి మాత్రం Ennis కి Jack రూమ్ చూపిస్తుంది. అక్కడ ఒక షర్టు చూస్తాడు 

అది ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం మొదటి సారి కలిసినప్పుడు Ennis వేసుకున్న షర్టు. అది కొండ మీద మర్చిపోయి కిందకి వచ్చేస్తారు. అంటే తర్వాత Jack వెళ్ళి ఆ షర్టు తెచ్చుకున్నాడు అన్నమాట. ఆ షర్టు Jack వేసుకున్న షర్టు రెండూ Jack తల్లిని అడిగి ఇంటికి తెచ్చేసుకుంటాడు. 

మెల్లిగా కొన్నేళ్ళు గడుస్తాయ్. Ennis కూతుళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. అతని పెద్ద కూతురు Ennis ని పెళ్ళికి పిలవడం కోసం ఇంటికి వస్తుంది. మొదట పెళ్ళికి వెళ్ళడానికి సంకోచించినా చివరికి వస్తాను అని ఒప్పుకుంటాడు.

కొద్ది సేపున్న తర్వాత కూతురు వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు వేసుకొచ్చిన ఒక జాకెట్ అక్కడ మర్చిపోతుంది.  దాన్ని తీసి బీరువాలో పెడుతూ అక్కడ దానికి తగిలించి ఉన్న Jack షర్టు, పక్కనే ఉన్న Brokeback Mountain కార్డ్ చూస్తూ ఉండటం తో సినిమా అయిపోతుంది.

అంటే ఇంకా Ennis Jack ని మర్చిపోలేదన్న మాట.

ఈ స్క్రిప్ట్ చదివాక Heath Ledger director Ang Lee ని కలిసి మరీ ఈ పాత్ర అడిగాడట.

సినిమాలో Jack గా చేసిన Jake Gyllenhaal చనిపోతాడు, అతని జ్ఞాపకాలతో Ennis గా వేసిన Heath Ledger బ్రతుకుతూ ఉంటాడు. 

కానీ రియల్ లైఫ్ లో “ది డార్క్ నైట్” లో జోకర్ గా చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అవడానికి ముందే Heath Ledger చనిపోయాడు. అప్పటి నుండీ Heath Ledger కూతురు “Matilda Ledger” కి సపోర్ట్ గా తండ్రి స్థానంలో Jake Gyllenhaal నిలబడ్డాడు. 

Heath Ledger చనిపోయింది January 2008 లో అయితే డార్క్ నైట్ సినిమా రిలీజ్ అయింది జూలై 2008 లో. అంటే ప్రపంచాన్ని కుదిపేసిన జోకర్ పాత్ర ని స్క్రీన్ మీద చూసుకోకుండానే చనిపోయాడు. తర్వాత ఆ జోకర్ పాత్రకి ఆస్కార్ అవార్డ్ రావడం విశేషం.

error: Content is protected !!