ఈ సినిమా నాకు అర్థం అయినంత మేరకు రాయడానికి ప్రయత్నం చేసా. మీకు అర్థం అయినంత మేరకు చదివి కామెంట్స్ పెట్టండి.

ఈ సోది చదివే ముందు ఒక మూడు సార్లు ఈ సినిమా చూడండి. ఇది కేవలం సినిమా చూసిన వాళ్ళ కోసం మాత్రమే.

ఈ సినిమా అంతా కూడా విలన్, హీరో, హీరోయిన్, సహాయ నటులు కాశీ మజిలీ కథల్లో లా ఏ పాత్రకి ఆ కథ ఉండి, మళ్లీ అందరూ కలిపి ఒకే కథలో ఉంటారు. ఇదే సమయంలో ఎవరి పాత్రకు వాళ్ళకే భూత, భవిష్యత్, వర్తమానాలు ఉంటాయి.

ఇక కథ విషయానికి వస్తె మనం చేసిన వెధవ పనులకు కాలుష్యం పెరిగిపోయి వాతావరణం మారిపోయి, సముద్రాలు పొంగిపోయి భవిష్య తరాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి.

అందుకని ఒక శాస్త్రవేత్త ఒక మిషన్ కనిపెట్టి దాని వల్ల గత కాలపు జనాన్ని నాశనం చేస్తే ఇక ఏ గొడవా ఉండదు అనుకుంటాడు.

కానీ మనసు మార్చుకుని దాన్ని 9 ముక్కలు చేసి తొమ్మిది చోట్ల దాచి పెడతాడు. ఒక్కో ప్రదేశం ఒక్కో న్యూక్లియర్ ప్లాంట్ లాంటి చోట్ల ఉంటుంది.

దీంట్లో ఒక ముక్క సినిమా మొదట్లో ఒపేరా జరిగే ఆడిటోరియం లో ఉంటుంది. ఇక్కడే దానికోసం హీరో ఒక అండర్ కవర్ ఆపరేషన్ లో పాల్గొంటాడు. అక్కడ హీరోకి ఒక ప్రమాదం జరగ బోతూ ఉండగా మాస్క్ వేసుకుని, వెనక ఒక రెడ్ కలర్ బ్యాగ్ వేసుకుని ఉన్న ఒక వ్యక్తి కాపాడతాడు.

ఈలోగా హీరోని ఒక గ్రూప్ పట్టుకుని ఆ ఆపరేషన్ కోసం చెప్పమని టార్చర్ పెడతారు. అతను చెప్పకుండా సైనెడ్ మింగేస్తాడు. తర్వాత అతను కళ్ళు తెరిచేసరికి అదంతా ఒక నాటకం అని, అతన్ని టెనెట్ అనే ఒక ఆర్గనైజేషన్ లోకి తీసుకోవడం కోసం పెట్టిన టెస్ట్ అనీ తెలుస్తుంది.

ఆ ఆర్గనైజేషన్ లో ఒక సైంటిస్ట్ అతనికి రివర్స్ లో పని చేసే కొన్ని పరికరాలు అంటే బుల్లెట్స్, గన్స్ లాంటివి చూపిస్తుంది. అవి ఎక్కడ నుండి వచ్చాయి అని అడుగుతాడు హీరో. భవిష్యత్తులో జరిగిన యుద్ధం నుండి సేకరించిన వస్తువులు అని చెప్తుంది.

అవి తయారయిన మెటీరియల్ ను బట్టి ఇప్పుడు ఎవరు సప్లయ్ చేశారో తెలిస్తే భవిష్యత్తులో అవి ఎవరు వాడుతున్నారు అనేది కనిపెట్టచ్చు అని హీరో అంటాడు.

ఆ మెటీరియల్ నీ బట్టి అవి ఇండియాలో ఉన్న “ప్రియా సింగ్” అనే ఒక ఆయుధ డీలర్ తయారు చేసింది అని కనుక్కుంటాడు. తీరా ఆమె దగ్గరకు వెళ్ళి అడిగేసరికి ఆమె తయారు చేసింది మేమే కానీ వాటిని అలా రివర్స్ లో పని చేసేలా చేసింది మాత్రం వేరే వ్యక్తి అని, అతని పేరు ఆండ్రూ సాటర్ అని చెప్తుంది. అతను ఒక టెక్నాలజీ వాడి టైమ్ ని ఇన్వర్స్ చేస్తూ ఉంటాడు.

అతన్ని కలవడానికి అతని భార్య ని ఒక ఫేక్ పెయింటింగ్ ఇచ్చి లైన్ లో పెడతాడు. ఆమె పేరు “క్యాట్”. ఇక్కడ క్యాట్ కి ఒక చిన్న స్టోరీ ఉంటుంది.

ఆమె అతని భర్త నుండి విడిపోదాం అనే ఆలోచనలో ఉంది. ఆమె వృత్తి పెయింటింగ్స్ అసలు వో నకిలీవో చూసి చెప్పడం. పొరపాటున ఒకసారి ఆమె ఒక నకిలీ పేయింటింగ్ అసలిది అని చెప్పి తన భర్త చేత కొనిపిస్తుంది. తర్వాత ఆమె విడిపోదాం అనుకున్నప్పుడు అతను ఆ విషయం గుర్తు చేసి అరెస్ట్ చేయిస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు.

హీరో ఆ నకిలీ పెయింటింగ్ దొంగిలించి తెస్తే అతను ఇంక ఆమెని బ్లాక్ మెయిల్ చెయ్యలేడు. ప్రతిఫలంగా ఆమె Satar ని పట్టుకోవడం లో సహాయం చెయ్యాలి. ఇదే డీల్.

ఆ పెయింటింగ్ ఓస్లో airport లో ఉన్న “ఫ్రీ పోర్ట్” లో ఉంటుంది. అంటే అక్కడ నుండి ఎలాంటి టాక్స్ లూ కట్టకుండా ఏ దేశానికి కావాలి అంటే ఆ దేశానికి వస్తువులు పంపచ్చు.

(కానీ ఆ వస్తువు ఆ ఫ్రీ పోర్ట్ లో ఉన్నంత వరకే టాక్స్ ఉండదు. అది దాటి వస్తె ట్యాక్స్ కట్టాలి. ఈ సౌకర్యం వాడుకుని చాలా మంది అక్కడే సరుకులు కొద్ది సేపు దాచుకుని అవసరం అయిన వేరే వాళ్ళకు టాక్స్ లేకుండా అమ్మేస్తారు. ఇలాంటి పోర్ట్ లు కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి.)

హీరో అతని కొలీగ్ అయిన “నీల్” ఇద్దరూ కలిసి air పోర్ట్ లో ఒక బ్లాస్టింగ్ ప్లాన్ చేసి ఆ హడావిడిలో ఆ పెయింటింగ్ కొట్టేయ్యాలి అని ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టే బ్లాస్టింగ్ జరుగుతుంది.

వీళ్ళు ఆ పెయింటింగ్ కొట్టేసే సమయంలో ఇద్దరి మీద హఠాత్తుగా ఇంకో ఇద్దరు ముసుగు మనుషులు వచ్చి దాడి చేస్తారు. హీరో పట్టుకోబోయే లోగా తప్పించుకుని పారిపోతారు.

అక్కడే హీరోకి “Turnstile” అనే మిషన్ కనిపిస్తుంది. అదే మనుషులను, వస్తువులను ఇన్వర్స్ చేసే మిషన్. ఆ మిషన్ లోకి వెళ్ళిన వ్యక్తి గతం లోకి, లేదా భవిష్యత్తు లోకి వెళతాడు. అలాంటి మిషన్ రెండు చోట్ల మాత్రమే ఉంది.

వీళ్ళు ఇంతా బ్లాస్ట్ ప్లాన్ చేసినా కూడా ఆ పేయింటిగ్ వీళ్లకు దొరకదు. ఆల్రెడీ Sator దాన్ని వేరే చోటకి మార్చేశాడు. క్యాట్ హీరోని తన భర్తకు పరిచయం చేస్తుంది. నెక్స్ట్ డే ముగ్గురూ ఒక బోట్ లో వెళుతూ ఉండగా అతను పెట్టే టార్చర్ తట్టుకోలేక క్యాట్ భర్తను నీళ్ళలోకి తోసి చంపెద్దాం అనుకుంటుంది. కానీ అతన్ని హీరో కాపాడతాడు. అంతే కాకుండా ప్లుటొనియం ఎక్కడ ఉందో చెప్తే అది కూడా సంపాదించి పెడతా అని డీల్ కూడా ఇస్తాడు.

Sator దానికోసం సమాచారం ఇచ్చాక హీరో, అతని ఫ్రెండ్ కలిసి దాన్ని దొబ్బీసి పారిపోదాం అనుకునే లోగా దారిలో ఒక కారులో “Sator” క్యాట్ బుర్ర మీద గన్ పెట్టీ ఆ ప్లుతోనియం బాక్స్ తనకు ఇచ్చెయ్యలి లేకపోతే ఆమెని చంపేస్తా అని బెదిరిస్తాడు. అక్కడ జరిగిన కార్ చేజ్ లో ఆమెకి తీవ్రంగా గాయాలు అయ్యి చనిపోయే పరిస్థితి లోకి వెళ్ళిపోతుంది.

ఆమెని కాపాడటానికి హీరో ఒక ప్లాన్ వేస్తాడు. అదేంటంటే ఆ turnstile మిషన్ ద్వారా గతం లోకి వెళ్లి మళ్ళీ ఆమెని కాపాడటానికి ప్లాన్ చేస్తారు. కానీ ఆ మిషన్ “ఓస్లో ఫ్రీ పోర్ట్” లో మాత్రమే వీళ్లకు అందుబాటులో ఉంది. అందుకే వీళ్ళు అక్కడకు వచ్చి మిషన్ లో గతంలోకి వెళతారు. అక్కడే పెయింటింగ్ కోసం వచ్చిన హీరో తన భవిష్యత్ హీరో తో fight చేశాడు అన్నమాట. అక్కడ తన “గతం ఉంటాడు” అన్న విషయం “భవిష్యత్తు హీరో” కి తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా ఫైట్ చేస్తాడు. కానీ గతం లో ఉన్న హీరో కి ఈ విషయం తెలియదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఫైట్ చేస్తాడు. మొత్తానికి వీళ్ళు అంటే హీరో, అతని ఫ్రెండ్ నీల్ గతానికి వచ్చి క్యాట్ కి ప్రమాదం జరగకుండా కాపాడతారు.

ఈ లోగా ప్రియా సింగ్ వచ్చి Sator కి 9 ముక్కలు దొరికేసాయి అనీ, అతను ఆ మిషన్ సహాయంతో ప్రపంచాన్ని నాశనం చెయ్యబోతున్నాడు అని చెప్తుంది.

తర్వాత క్యాట్ ఒక నిజం చెప్తుంది. అదేంటంటే Sator కి క్యాన్సర్. అందుకని అతను తన heart కి ఒక స్విచ్ అమర్చి అతను చనిపోయిన మరుక్షణం ఆ స్విచ్ ఆన్ అయ్యి ఆ మిషన్ రన్ అయ్యేలా ప్రోగ్రాం తయారు చేసి పెట్టుకున్నాడు. ఒక బోట్ లో ఫ్యామిలీ తో సహా ట్రిప్ కి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకుని చావాలి అని ప్లాన్ చేసుకున్నాడు అని.

హీరో కావాలి అనుకుంటే Sator ని వెంటనే చంపెయ్యగలడు. కానీ అతని చావుతో ఈ ప్రపంచం ముడి పడి ఉంది. అందుకని ముందు ఆ మిషన్ ని నాశనం చేసి తర్వాత ఇతన్ని చంపాలి. కానీ అది న్యూక్లియర్ ప్లాంట్ల దగ్గర ఉంది. తీరా ఆ ప్రదేశం లో ఎటాక్ చేశాక ఆ మిషన్ పొరపాటున పని చెయ్యడం మొదలు పెడితే దాని వల్ల భవిష్యత్తు ఏంటి అనేది తెలియదు, అలాగే అక్కడ ఉన్న రక్షణ వివరాలు మొదలైనవి ఏమీ తెలియదు.

అందుకని ఒక ప్లాన్ వేస్తారు. అదే పిన్సర్ మూమెంట్. అంటే రెండు వైపుల నుండి ఎటాక్ చెయ్యడం. ముందు నుయ్యి వెనక గొయ్యి లా అన్నమాట. అయితే ఇది టైమ్ ట్రావెల్ సినిమా కాబట్టి ముందు వెనక కాకుండా భవిష్యత్తు నుండి, గతం నుండి కూడా ఆ న్యూక్లియర్ ప్లాంట్ మీద ఎటాక్ చేస్తారు.

ఒక పది నిమిషాల ముందుకు వెళ్లి ఒక బ్లూ ఆర్మీ, ఒక పది నిమిషాలు గతం లోకి వెళ్లి ఒక రెడ్ ఆర్మీ ఒకేసారి ఒకే ప్రదేశం లో ఎటాక్ చేస్తే భవిష్యత్ లో ఉన్నవాళ్లు గతం లో ఉన్నవాళ్లకు సమాచారం పంపవచ్చు. దానిద్వారా గతం లో వాళ్ళు వాళ్ళ యుద్ధ వ్యూహాలు మార్చుకుని ఎటాక్ చేస్తూ ఉంటారు.

అలా ఒక పది నిమిషాల తర్వాత ఆ మిషన్ ని ముక్కలు చేసేసి హీరో, నీల్, మరో సైనికుడు పంచుకుని ఇక జీవితం లో కలవకూడదు అని ఫిక్స్ అయ్యి విడిపోతారు. ఆ మిషన్ లేకపోతే ఇక అటాక్స్ ఉండవు.

తర్వాత హీరో గతం లోకి వచ్చి ఆ మిషన్ పని చెయ్యడానికి అవసరం అయిన ప్లుతొనియం సప్లయ్ చేసే ప్రియా సింగ్ ని కాల్చి పడేయటం తో కథ ముగుస్తుంది.

ఒకసారి ఇది చదివాక(?) కింద కొంచెం టెక్నికల్ డిటైల్స్ ఇచ్ఛా. అవి కూడా చదవండి. అప్పుడు మళ్లీ ఒకసారి పైన రాసింది చదవండి.

1. Entropy

అంటే ఏమీ లేదు. ఏదైనా ఒక క్రియ జరిగేటప్పుడు కలిగే మార్పు గురించి చెప్పడం. భౌతిక శాస్త్ర పరంగా ఇది ఎప్పుడూ కూడా పాజిటివ్ గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో దీన్ని భవిష్యత్తు శాస్త్రవేత్తలు నెగటివ్ లేదా రివర్స్ చేస్తారు.

ఉదాహరణకు ఒక స్టవ్ మీద ఐస్ క్యూబ్స్ గిన్నె పెట్టి వేడి చేస్తే ఆ క్యూబ్స్ నీళ్ళు అవుతాయి. ఇంకా వేడి చేస్తే ఆవిరి అవుతాయి. కానీ ఆ శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్త విజ్ఞానం వల్ల భవిష్యత్తు నుండి ఆవిరి తెచ్చి వర్తమానంలో పొయ్యి మీద పెడితే నీళ్ళు అవుతాయి, అవే నీళ్ళు ఇంకా వేడి చేస్తే ఐస్ క్యూబ్స్ కింద మారిపోతాయి. ఎందుకంటే గతంలో అవి ఐస్ క్యూబ్స్ కాబట్టి. అలాగని ఆ నీళ్ళ గిన్ని అలాగే భవిష్యత్తు నుండి వర్తమానం లోకి తెచ్చి వదిలేస్తే ఎంత సేపటికి కూడా ఐస్ క్యూబ్స్ అవ్వవు. ఖచ్చితంగా పొయ్యి మీద పెట్టడం అనే ఒక చర్య జరగాల్సిందే. అప్పుడే రివర్స్ లో జరుగుతుంది.

అందుకే హీరో మొదట్లో గన్ పెల్చినప్పుడే బుల్లెట్ మళ్ళీ గన్ లోకి వస్తుంది. అంతే గానీ గన్ ఖాళీగా పెట్టినప్పుడు రాదు. అలాగే ఆ లేడీ సైంటిస్ట్ బుల్లెట్ పడేసినట్టు చర్య జరిగినప్పుడే ప్రతి చర్య గా బుల్లెట్ మళ్ళీ చేతిలోకి వచ్చింది. అంతే కాని హీరో జస్ట్ చెయ్యి చూపిస్తే రాలేదు.

(అంటే ఇక్కడ ఆ నీళ్ళ గిన్నె పొయ్యి మీద పెట్టాలా వద్దా, గన్ పెల్చాలా వద్దా అనే నిర్ణయం మీదే. కానీ దాని ఫలితాలు మాత్రం వేరే గా వస్తాయి. అంటే చర్యకి ప్రతి చర్య గా మాత్రమే జరుగుతాయి. కానీ ఆ ప్రతి చర్య అనేది రివర్స్ లో ఉంటుంది.)

2. Time inverse

దీన్ని టైమ్ ట్రావెల్ తో కంపార్ చెయ్యకండి. టైమ్ ట్రావెల్ అంటే ఒక సినిమా చూస్తూ స్కిప్ చేసి నెక్స్ట్ చాప్టర్ లేదా ప్రీవియస్ చాప్టర్ కి వెళ్ళడం.

టైమ్ inverse అంటే సినిమాని ఫాస్ట్ ఫార్వర్డ్ లేదా రివర్స్ చేస్తూ సినిమా చూడటం అనుకోండి. అందుకే ఒకసారి టైమ్ ఇన్వర్స్ జరిగే సమయంలో అందరూ వెనక్కు నడుస్తూ ఉంటారు.

ఆ సమయంలో టైమ్ ఇన్వర్స్ ద్వారా వచ్చిన వాళ్ళు అందరూ “మాస్క్” పెట్టుకుని ఉంటారు. కారణం ఆక్సిజన్ బయటకు వచ్చి, co2 లోపలకు వెళుతూ ఉంటుంది. (అంతా రివర్స్ కదా).

అలాగే భవిష్యత్తు అంతా “blue” లో ఉంటుంది. గతం అంతా ” రెడ్” లో ఉంటుంది.

3. Turnstile

ఇదొక టైమ్ ఛాంబర్ లాంటిది. ఒక జోక్ గుర్తు ఉందా.
ఒకావిడ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. హఠాత్తుగా మొగుడికి ఫోన్ చేసి హైవే మీద ఎవరో రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ఏకంగా కొన్ని వందల మంది హైవే మీద అలా రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తూ కనబడుతున్నారు అని చెప్తుంది. అంటే ఈ ఛాంబర్ లోకి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చేసరికి “గతం లేదా భవిష్యత్తు” లోకి వెళ్ళిపోతారు తప్ప ప్రస్తుతం లో ఉండరు. అందువల్ల జరిగేవి అన్నీ రివర్స్ లో కనిపిస్తూ ఉంటాయి.

4. పిన్సర్ moment.

రెండు వైపుల నుండీ శత్రువును అట్టాక్ చెయ్యడం.

ఈ సినిమాలో టైమ్ ద్వారా రెండు వైపుల నుండీ ఎటాక్ చేస్తారు.

ఉదాహరణకు మీరు చేస్ ఆడుతున్నారు అనుకుందాం. మీరు ఒక ఎత్తు వేశారు, అవతలి వ్యక్తి ఇంకో ఎత్తు వేశాడు. మీ ఫ్రెండ్ ఒకడు భవిష్యత్తు లోకి అంటే ఒక పది ఎత్తుల ముందుకు వెళితే మీ ప్రత్యర్థి ఎత్తులు అన్నీ అక్కడ కనిపిస్తాయి. అతను మీకు అవి చెప్తే మీరు మీ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది.

అంటే అతని ఆట మీరు ముందే చూసి జాగ్రత్త పడుతున్నారు. ఇదే విధంగా సినిమా క్లైమాక్స్ లో ఎక్కడ ఏ బాంబు ఎలా పేలుతుంది అనేది భవిష్యత్తు లోకి వెళ్ళిన ఆర్మీ గతానికి చెప్తూ ఉంటుంది.

నోట్: ఇదంతా “నాకు అర్థం అయినంత వరకూ రాశా. ఇదే ఫైనల్ కాదు. మీకు ఇంకోలా అర్థం అవ్వచ్చు. అది కూడా రాయండి.”.

error: Content is protected !!