ముందు ఈ సినిమా కథ చదవండి. టైటిల్ అలా ఎందుకు పెట్టారో ఆఖర్లో చెప్తా.

1930ల్లో అలబామాలోని మేకాంబ్ అనే ఊళ్లో స్కౌట్ అనే పిల్ల, ఆమె బ్రదర్ జెమ్‌లు ఉంటారు. అదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తండ్రి అట్టికస్ ఫించ్, అట్టికస్ భార్య లేదు. కానీ అతను పిల్లల్ని బాగా చూసుకుంటూ ఉంటాడు. ఆఫ్రికన్-అమెరికన్ హౌస్‌కీపర్ కాల్పర్నియా అనే హౌస్ కీపర్ రోజూ ఇంటికి వచ్చి ఇల్లు, పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది.

వాళ్ళ ఇంటి పక్కనే బూ రాడ్లీ అనే ఒక విచిత్రమైన వ్యక్తి ఉంటాడు.  బూ ఎప్పుడూ బయటకు రాడు, అతని అన్న నాథన్‌తో ఇంట్లోనే ఉంటాడు.

ఒక సమ్మర్ లో స్కౌట్, జెమ్, వాళ్ళ ఫ్రెండ్ డిల్ కలిసి ఆటలు ఆడుకుంటూ బూ రాడ్లీని చూడాలని ట్రై చేస్తారు. కానీ భయపడి పారిపోయి వచ్చేస్తారు. ఒకసారి జెమ్ కి రాడ్లీ ఇంటి ముందున్న చెట్టు తొర్రలో కొన్ని సామాన్లు, పాత పని చేయని గడియారం, పాత మెడల్, కత్తి, సబ్బు బొమ్మలు దొరుకుతాయి. దాంతో బూ బ్లాక్ మ్యాజిక్ చేస్తుంటాడు అనుకుంటారు.

అట్టికస్ ఒక లాయర్. “అందర్నీ సమానంగా ట్రీట్ చేయాలి, బాల హీనుల హక్కుల కోసం పోరాడాలి” అని నమ్మే వ్యక్తి. అతని క్లయింట్లు చాలా మంది పేద రైతులు. వాళ్ళు ఫీజు కింద డబ్బు బదులు కూరగాయలు, కట్టెలు ఇస్తూ ఉంటారు. 

అట్టికస్ దగ్గరకి వచ్చే కొన్ని కేసుల వల్ల స్కౌట్, జెమ్‌లు ఊళ్లో జాతి వివక్ష ఎలా ఉంటుందో చాలా దగ్గరగా చూస్తారు. పేదరికం వల్ల ఈ వివక్ష ఇంకా ఎక్కువవుతుంది. దీంతో వాళ్ళు చిన్న వయసులోనే పెద్దవాళ్ళలా ఆలోచించడం నేర్చుకుంటారు.

ఒకసారి అట్టికస్‌కి టామ్ రాబిన్సన్ అనే ఆఫ్రికన్ – అమెరికన్‌ని డిఫెండ్ చేయమని కేసు వస్తుంది. టామ్‌ ఒక తెల్ల అమ్మాయి మయెల్లా ఇవెల్‌ని అత్యాచారం చేశాడని ఆరోపిస్తారు. ఆట్టికస్ ఈ కేసు వాదించకూడదు అని కొంతమంది తెల్లవాళ్ళు చెప్తారు. కానీ ఆట్టికస్ ఒప్పుకోడు. 

ఈ కేసు వల్ల మెల్లిగా ఊళ్లో గొడవలు పెరుగుతాయి. స్కౌట్, జెమ్‌లను చంపేస్తాం అని కొందరు బెదిరిస్తారు.

విచారణకు ముందు రాత్రి, టామ్‌ని చంపడానికి కొందరు గుంపుగా వస్తారు. అట్టికస్ అతన్ని కాపాడటానికి బయట కూర్చుంటాడు. స్కౌట్, జెమ్, డిల్ అక్కడికి వచ్చేస్తారు. మొత్తానికి గా గుంపు కొద్దిసేపు గొడవ చేసి వెళ్ళిపోతారు. 

ఆ మర్నాడు కేసు కోర్టుకి వస్తుంది. 

కోర్టులో టామ్ మయెల్లా ఇంటికి ఒక చెట్లు కొట్టడానికి వెళ్ళాడని, కానీ ఆమె మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసాడని. ఒప్పుకోక పోవడంతో కొట్టాడని, ఆమె వంటి మీద కొట్టిన గుర్తులు ఉన్నాయని పోలీసులు చెప్తారు.  

కానీ అవన్నీ లెఫ్ట్ హ్యాండ్ తో చాలా బలంగా కొట్టినట్టు ఉంటాయ్. 

కానీ అట్టికస్, టామ్ లెఫ్ట్ హ్యాండ్ పని చేయదని, కాబట్టి ఆమెని కొట్టిన వ్యక్తి టామ్ కాదని వాదిస్తాడు. మయెల్లా తండ్రి బాబ్ ఇవెల్ ది ఎడమచేతి వాటం అనీ, కాబట్టి అతనే ఆమెను కొట్టాడని నిరూపిస్తాడు. పైగా రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ అసలామెను చూడలేదని కూడా చెప్తాడు. 

అవన్నీ అయ్యాక అసలేం జరిగింది అని టామ్ ని అడుగుతారు.

టామ్ ఆమె ఏదో పనుందని పిలిచింది. నేను వెళ్లాను. ఆమె సాయం అడిగే నెపంతో దగ్గరకి వచ్చి ముద్దు పెట్టింది. దాంతో ఆమె తండ్రి బాబ్ ఆమెని కొట్టాడు అని చెప్తాడు. 

కానీ ఇవన్నీ తెల్లవాళ్ళకు నచ్చవు. వాళ్లకి కావాల్సింది టామ్ దోషిగా కనబడాలి. శిక్ష పడాలి.

అట్టికస్ జ్యూరీతో, “పక్షపాతం వదిలేసి, టామ్ ని చూడండి. అతను నిర్దోషి అని తెలుస్తుంది” అని చెప్తాడు. కానీ తెల్ల వాళ్ళ జ్యూరీ టామ్‌ని దోషి గా నిర్ధారణ చేసి శిక్ష వేస్తుంది. 

అట్టికస్ కోర్టు హాల్ నుండి బయటకు వెళ్తుంటే, ఆఫ్రికన్ – అమెరికన్లు గౌరవంగా లేచి నిలబడతారు..

ఇంటికి వచ్చాక  లోకల్ పోలీస్ ఆఫీసర్ టేట్, టామ్ తప్పించుకునే టైంలో చనిపోయాడని చెప్తాడు. అట్టికస్ జెమ్‌తో కలిసి టామ్ ఇంటికి వెళ్ళి విషయం చెప్పి ఓదారుస్తాడు. 

కానీ ఉక్రోషం పట్టలేని బాబ్ ఇవెల్ వచ్చి అట్టికస్ మొహంపై ఉమ్మేస్తాడు.

మెల్లిగా కొన్ని నెలలు గడుస్తాయ్. ఋతువులు మారతాయ్. 

స్కౌట్, జెమ్ స్కూల్ ఫంక్షన్ కి వెళతారు. స్కౌట్ హామ్‌లా డ్రెస్ వేస్తుంది. ఫంక్షనయ్యాక ఇంటికి వెళ్తుంటే చీకట్లో ఎవరో దాడి చేస్తారు. స్కౌట్ డ్రెస్ వల్ల ఆమెకి పెద్దగా దెబ్బలు తగలవు, కానీ జెమ్ స్పృహ కోల్పోతాడు. ఈలోగా పక్కనుండి ఎవరో ఒక వ్యక్తి వచ్చి దాడి చేసేవాడిని చంపేస్తారు. 

స్కౌట్ ఇంటికి చేరి, జెమ్‌ని తీసుకొస్తున్న ఒక వ్యక్తిని చూస్తుంది. డాక్టర్ జెమ్ చేతిని చూస్తాడు.

స్కౌట్ షెరీఫ్, అట్టికస్‌తో మాట్లాడుతూ, జెమ్ గదిలో ఒక వ్యక్తిని చూస్తుంది. అది బూ రాడ్లీ. మొదట్లో పిల్లలు భయపడింది ఇతనికే. 

అతనే పిల్లల్ని కాపాడి, ఇవెల్‌ని చంపాడు. కానీ టేట్, ఇవెల్ కత్తిపై పడి చనిపోయాడని చెప్తాడు. కారణం బూ ని బయటకు తీసుకురాకూడదని అంటాడు. ఎందుకంటే అతనొక ఇంట్రావర్ట్. ఎవరి జోలికి వెళ్ళడు. 

దాంతో స్కౌట్, “అతన్ని ఇబ్బంది పెట్టడం మాకింగ్‌బర్డ్‌ని చంపడం లాంటిది” అని అంగీకరిస్తుంది.

ఇప్పుడు ఈ కథకి ఈ పేరెందుకు పెట్టారో చూద్దాం. 

అమరావతి కథల్లో “ఒక రోజెళ్ళి పోయింది” అనే ఒక కథ గుర్తుందా.?

ఒక పెద్దాయన ఎవరి జోలికి వెళ్ళకుండా హాయిగా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆయన చనిపోతాడు. అలా బ్రతికితే చాలదా.? చాలదు. అలా ఉండే వాళ్ళని కెలికి వాళ్ళ జీవితాలు నాశనం చేసే దాకా కొంత మందికి నిద్ర పట్టదు.

అలాగే Mockingbird కూడా ఎవరి జోలికి వెళ్ళకుండా ఒక చెట్టు మీద కూర్చుని పాటలు పాడుకుంటూ దాని పనేదో అది చేసుకుంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఊరికే చంపడం కొందరికి సరదా, వినోదం, వ్యాపకం, వ్యాపారం.

ఈ సినిమాలో కూడా బూ రాడ్లీ కూడా Mockingbird లా ఎవరి జోలికీ వెళ్ళకుండా తన గదిలో కూర్చుని ఉంటాడు. అతడిని స్కౌట్, జేమ్ డిస్ట్రబ్ చేద్దాం అనుకుంటారు. 

అలాగే శిక్ష పడిన టామ్ కూడా ఎవరి జోలికీ వెళ్ళకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కానీ Mayellaa అతడ్ని రెచ్చగొట్టి కేసులో ఇరికిస్తుంది. 

ఆ విషయం అర్థమయ్యే సినిమా చివర్లో బూ సాయం చేసినా కూడా అనవసర పబ్లిసిటీ వల్ల అతని లైఫ్ డిస్ట్రబ్ అవుతుంది అనే టేట్ అతన్ని కేసునుండి తప్పిస్తాడు.

 కోర్టు రూమ్ డ్రామాల్లో , జాతి వివక్ష మీద వచ్చిన సినిమాల్లో ఈ సినిమాది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.

In Photo: జైలు దగ్గర టామ్ ని చంపడం కోసం వచ్చిన తెల్ల వాళ్ళ గుంపు ముందు “ఎవడొస్తాడో రండి చూసుకుందాం!” అని కుర్చీ వేసుకుని కూర్చుని బుక్ చదువుకుంటున్న ఆట్టికస్ 

To Kill a Mockingbird, Gregory Peck, Harper Lee, 1962 Classic, Courtroom Drama, Oscar-winning Film, American Literature Adaptation, Classic Cinema, Black and White Film, Drama Movie, Racial Injustice, Moral Courage, Southern Gothic, Coming of Age, Social Commentary, Civil Rights, Justice and Equality, Innocence Lost, Mockingbird Symbolism, Human Rights, Atticus Finch, Scout Finch, Tom Robinson, Boo Radley, Maycomb Alabama, Trial Scene, Lynch Mob, Father-Daughter Bond, Powerful Closing Speech, Iconic Characters, Best Courtroom Movies, Based on True Story, Movies About Racism, Must Watch Classic Films, Films Set in 1930s America, Films on Social Justice, Inspirational Movie Characters, Gregory Peck Best Performance, Top Oscar Movies 1960s, Movies That Changed Society

error: Content is protected !!