“Memento” అనగా “గజనీ”..!
ఎలాగైనా “మెమెంటో” మూవీని రివర్స్ లో ఎడిటింగ్ చేసి చూడాలి. లేకపోతే అర్థం అయ్యేలా లేదు..!
మెమెంటో అంటే మురుగదాస్ సూర్య తో తీసి వదిలిన “గజని” అసలు సినిమా…!
ఈ సినిమా స్టోరీ దాదాపు అందరికీ తెలుసు కాబట్టి ఎక్కువ చెప్పక్కరలేదు.
ఒక గుండా హీరో భార్యని చంపేసి హీరో ని ఒక రాడ్డు ఇచ్చుకుని గుండు మీద గాట్టిగా ఒకటేస్తే మెదడు దొబ్బీ “వర్తమానం” మర్చిపోయె హీరో గతం లో తనకు అన్యాయం చేసిన రౌడీ ని ఫోటోల సాయంతో వెతుక్కుంటూ వెళ్లి చంపేయడం..!
సింపుల్ గా చెప్పాలి అంటే ఒక రివెంజ్ డ్రామా..! కానీ అలా సింపుల్ గా తెల్చేస్తే ఆయన ప్రతిభ ఏం కనబడుతుంది..! అందుకే ఒక కొత్త ఫార్ములా కనిపెట్టాడు..!
మాములుగా మనం కొన్ని సీన్లు చూస్తూ ఉంటాం ఉదాహరణకు “అష్టా చెమ్మా” సినిమా.
ఆ సినిమా మొదలవ్వగానే కలర్స్ స్వాతి ఒక ఫోటో పట్టుకుని గాల్లో ఎగురుతుంది. అసలు ఆ అమ్మాయి అలా ఎగరడానికి కారణం ఏంటి అని ఒక వాయిస్ ఓవర్ వినబడి, అక్కడ నుండి మెయిన్ సినిమాకు వచ్చి సినిమా అంతా అయ్యాక చివర్లో ఈ సీన్ కి లింక్ కలుపుతారు..!
ఒకవేళ మీరు గానీ ఆ మొదట్లో సీన్ మర్చిపోతే..!
అలాగే కొన్ని సినిమాల్లో అల్లరి నరేష్ లేదా కొంతమంది కమెడియన్లు కుక్కలు లేదా రౌడీ లు తరుముతుంటే పరుగెత్తుకుంటూ వస్తూ ఉంటే అక్కడ సినిమా అలా ఆపి “రెండు గంటల ముందు లేదా రెండు రోజుల ముందు” అని ఒక చిన్న టెక్స్ట్ స్క్రీన్ మీద వేసి వాళ్ళు ఎలా పరిగెట్టడానికి కారణం ఇది అని చూపించి లింక్ కలుపుతారు..!
ఇలా ఒకటి రెండు సీన్లు అయితే పర్లేదు. కానీ సినిమా మొత్తం అలాగే ఉంటే, ప్రతీ సీను ఫ్లాష్ బ్యాక్ లా ఉంటే అదే “మెమెంటో” సినిమా..! గజనీ రీమేక్..!
అసలే ఈ రివర్స్ స్క్రీన్ ప్లే పైగా ఇంగ్లీష్..!
సబ్ టైటిల్స్ చూడాలా..!
ముందు జరిగిన సీన్ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలా..!
ఇప్పుడు జరిగే సీన్ నీ గుర్తు పెట్టుకోవాలా..!
(తర్వాత గుర్తు తెచ్చుకోవాలి కదా..!)
ఆ రెండు సీన్లు లింకు పెట్టుకోవాలా..!
ఆల్రెడీ గజనీ చూసి చచ్చాం కాబట్టి మళ్ళీ ఈ సినిమా ఆ సినిమాతో పోల్చి ఎలా తీసాడో చుస్కోవాలా..!
(మళ్ళీ హిందీ గజనీ చూసి ఉంటే వాళ్ళకు ఇంకో పని ఈసారి మూడు పోల్చి చుస్కోవాలి)..!
ఇలా ఈ సినిమా చూడ్డానికి అష్టావధానం చేస్తే గాని పూర్తవ్వలేదు…!
ఇంతకీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరో చెప్పలేదు కదా..!
ఇప్పటికీ జనాలు జుట్టు పీక్కుంటూ చూసే “Interstellaar” సినిమా డైరెక్టర్ “క్రిస్టోఫర్ నొలాన్”..!
అలాగని ఆయనేదో అన్నీ అలాంటి బ్రెయిన్ కి పని పెట్టే సినిమాలే తీస్తాడు అనుకునేరు.
బ్యాట్ మాన్ సిరీస్ లో భాగం అయిన
Batman Begins,
The Dark Knight,
The Dark Knight Rises
లాంటి భీభత్సమైన మాస్ మసాలాలు కూడా ఉన్నాయి..!
రెండో ప్రపచయుద్ధం మీద తీసిన Dunkirk..!
ఇద్దరు మజిషియన్ల మధ్య పోటీ గురించి, సైన్సు మిక్స్ చేసి తీసిన The Prestige…! లాంటి కథా కాలక్షేపాలు కూడా ఉన్నాయి..!
ఏదో ఆల్రెడీ గజినీ చుసేసాం కాబట్టి స్టోరీ బాగానే అర్థం అయింది..! కాకపోతే కొంచెం బుర్ర దగ్గర పెట్టుకుని చూడాల్సి వచ్చింది..! గజనిలో ఉన్నట్టు హీరోయిన్ కి ఎంతో సీన్ ఉంటుంది అనుకునేరు. సినిమా అయ్యాక ఆవిడ మొహం కూడా సరిగ్గా గుర్తు ఉండదు. సినిమా మొత్తం హీరో గై పియర్స్ మాత్రమే ప్రతీ సీన్ లో ఉంటాడు..!
“Memento” అనగా “గజనీ”..!
ఎలాగైనా “మెమెంటో” మూవీని రివర్స్ లో ఎడిటింగ్ చేసి చూడాలి. లేకపోతే అర్థం అయ్యేలా లేదు..!