పేరు పెద్దగా ఉన్నా సినిమా మాత్రం చిన్నగా షార్ప్ గా ఉంటుంది.

అనగనగా ఒక పోలీస్ ఆఫీసర్.

ఆయనకి ఒక గర్ల్ ఫ్రెండ్.

ఆ గర్ల్ ఫ్రెండ్ కి ఒక భర్త.

ఒకసారి ఆ పోలీసాయనకి ఆమెతో చిన్న క్లాష్ వచ్చి, దాంతో కోపం వచ్చి సరదాగా ఆమెని చంపేస్తాడు. ఏమీ తెలియనట్లు బయటికి వచ్చి తన ఆఫిస్ కి వెళ్ళిపోతాడు.

ఆ హత్య ఎవరు చేశారో కనుక్కోవడం కోసం పోలిసులు తెగ తంటాలు పడుతూ ఉంటారు. ఈయనకి సంబంధం లేకపోయినా కూడా ఆ కేసు ఏమైంది అని కావాలనే ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. వినోదం చూస్తూ ఉంటూ అపుడపుడు ఎవరెవరి మీదో అనుమానం వచ్చేలా కొన్ని ఆధారాలు సరదాగా వదులుతూ ఉంటాడు.

అవి కనుక్కుంటూ వెళ్లిన పోలీసులకు కేసు మళ్ళీ మొదటికే వస్తూ ఉండటం వల్ల వాళ్ళు ఆ ఆధారాలను పక్కన పడేసి మళ్ళీ అసలు హంతకుడు ఎవరా అని వెతుకుతూ ఉంటారు.

దాంతో తనే హంతకుడు అన్నట్టు చిన్న చిన్న మాటలు, ఆధారాలు ద్వారా చెప్తూ ఉంటాడు. అయినా కూడా ఎవరూ ఆ మాటలు సీరియస్ గా తీసుకోకుండా మీరు ఇలాంటి పనులు చేశారంటే ఎవరు నమ్ముతారు సార్. ఒకవేళ నిజంగా చేసినా కూడా మిమ్మల్ని ప్రశ్నించే ధైర్యం ఎవరైనా చెయ్యగలరా అని పొగుడుతూ ఉంటారు

ఇక తనను ఎవరూ పట్టుకోలేరు అని అహంకారం పెరుగుతుంది.

హంతకుడు తనే అని ఆధారాలు ఇస్తూ ఉన్నా కూడా పట్టుకోలేని ఆ పోలీసుల చేతకాని తనం చూసి నవ్వొస్తుంది.

చివరికి తాను చట్టం కన్నా గొప్ప వ్యక్తి గా భావించుకుంటూ, తనను ఎవరూ పట్టుకోలేరని నమ్మకం తో తన ఇంటిని పోలీసులు చుట్టు ముట్టినట్టు, తనను ఆ హత్య ఎందుకు చేశావని ఎంక్వైరీ చేసినట్టు ఊహించుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు.

చివరికి దొరికాడా లేదా అనేది సస్పెన్స్.

ఈ సినిమాలో ఆ పోలీస్ ఆఫీసర్ పాత్ర కి పేరు ఏమీ ఉండదు. ఇలా పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన తప్పులు కప్పి పుచ్చే వాళ్ళు అన్ని చోట్లా, అందరిలోనూ ఉన్నారని దర్శకుడు భావించి పేరు పెట్టి ఉండడు.

అసలు చేతిలో అధికారం ఉంటే ఒక మనిషి ఎంతకు తెగించచ్చో, చట్టాన్ని ఎలా మోసగించి హాయిగా తిరగచ్చో ఈ సినిమాలో భలే చూపిస్తాడు.

ఇదొక ఇటాలియన్ సినిమా.

క్రైమ్ డ్రామా మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతీ వాళ్లూ చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా.

కింద ఫోటో లో హత్య చేసి ఆధారాలు ఇస్తున్నా పోలీస్ ఆఫీసర్.

తనని ఎవరూ పట్టుకోలేరనే ధైర్యం తో గర్వంగా చూస్తున్న పోలీస్ ఆఫీసర్.

సినిమా పోస్టర్ లో పోలీస్ ఆఫీసర్.

OTT తెలియదు.