Who Killed Cock Robin

Who killed Cock Robin..!

హీరో ఒక జర్నలిస్ట్. ఒకరోజు రాత్రి తన కార్ ఏక్సిడెంట్ కి గురవుతుంది. కార్ తీసుకుని మెకానిక్ దగ్గరకు వెళ్ళి రిపేర్ చెయ్యమంటాడు.

మెకానిక్ ఒకసారి కార్ చూసి ఈ కార్ ఇక రిపేర్ చెయ్యడానికి పనికి రాదు. ఇది ఒరిజినల్ కార్ కాదు. ఒక్క కార్ నంబర్ తప్ప మిగతావన్నీ అక్కడో పార్టు, ఇక్కడో పార్టు అతికించి ఎవరో నీకు అంటగట్టారు. ఇక పక్కన పడెయ్యి అని చెప్తాడు. తనకు అమ్మిన కార్ బ్రోకర్ దగ్గరకు వెళితే సంబంధం లేదు పొమ్మంటాడు.

ఖంగుతిన్న హీరో ఆ సెకండ్ హ్యాండ్ కార్ అంతకు ముందు ఎవరేవరు వాడారా అని వెళ్ళి తనకు తెలిసిన ఒక పోలీస్ ద్వారా కనుక్కొగా ఆ కారు కి ఎప్పుడో 9 ఏళ్ల క్రితం ఒక ఏక్సిడెంట్ అవుతుంది. ఆ కార్ లో ప్రయాణించే వ్యక్తుల్ని మరో కార్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోతుంది.

సరిగ్గా అదే సమయంలో హీరో అక్కడే ఉంటాడు. రక్షిద్దాం అనుకునే లోగా కార్ లో ఒక వ్యక్తి చనిపోగా, మరో అమ్మాయి కోమా లోకి వెళ్ళిపోతుంది. అంబులెన్స్ కి ఫోన్ చేసి, ఫోటోలు తీసి ఈ విషయాన్ని ఎడిటర్ కి చెప్తాడు. కానీ ఎడిటర్ అది పెద్ద వార్త కాదని, రోజూ ఏక్సిడెంట్ వార్తలు వస్తూనే ఉంటాయి అని తీసి పడేస్తాడు. హీరో కూడా మర్చిపోయాడు.

కానీ సరిగ్గా 9 ఏళ్ల తర్వాత మళ్లీ అదే కార్ కి ఏక్సిడెంట్ అవడంతో అసలు ఆ కారు ఒరిజినల్ ఓనర్ ఎవరో కనుక్కోడానికి హీరో ఎంక్వైరీ మొదలెడతాడు.

ఈ క్రమంలో 9 ఏళ్ల క్రితం జరిగిన ఏక్సిడెంట్ లో “హీరోయిన్ కి, చీఫ్ ఎడిటర్ కి, మెకానిక్ కి, తనకు కార్ నంబర్ డిటైల్స్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్ కి” సంబంధం ఉంది అని తెలుస్తుంది.

అంతే కాకుండా ఆ ఏక్సిడెంట్ వెనక ఒక పాప కిడ్నాప్, మర్డర్, 2మిలియన్ల డాలర్లు డబ్బు కూడా ముడిపడి ఉన్నాయని, ఆ వేళ కోమాలోకి వెళ్ళిన అమ్మాయి ఆ మర్నాడు హాస్పిటల్ నుండి తప్పించుకు పోయింది అని కూడా ఎంక్వైరీ లో తెలుస్తుంది.

మొదట అరగంట కొంచెం బోర్ గా ఉన్నా కూడా హీరో వెతకటం మొదలయ్యాక బావుంటుంది. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ కి, ప్రస్తుతం జరిగే కథకి మారుతూ ఉంటుంది. తైవాన్ సినిమా కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడాలి. లేకపోతే అర్థం కాదు. ఒక్క హీరో హీరోయిన్ తప్ప మిగతా వాళ్ళ పేర్లు, మొహాలు గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టం.

సింపుల్ గా రాయడం కోసం ఎక్కువ డిటైల్స్ ఇవ్వలేదు.

ఈ సినిమా లో ప్రస్తుత కాలం లో జరిగే కథలో అంతా కూడా ఏక్సిడెంట్ అయ్యింది కాబట్టి హీరో “చెయ్యి” కి కట్టు కట్టుకునే ఉంటాడు.

ఈ సినిమా పేరు తైవాన్ లో “Eye Witness” అని పెట్టారు. ప్రేక్షకులకు ఆ సంఘటనల్లో తాము కూడా ఉన్న ఫీల్ రావడం కోసం సినిమా లో చాలా పార్ట్ “handheld shooting” టెక్నిక్ ఉపయోగించి తీసారుట.

దాదాపు ఇదే పాయింట్ తో కన్నడం లో “కావలుదారి” అనే సినిమా వచ్చింది. కాకపోతే దానిలో హీరో 40 ఏళ్ల క్రితం జరిగిన హత్యలు ఎలా జరిగాయో కనుక్కుంటాడు.

#whokilledcockrobin