జీవితంలో నిరాశా నిస్పృహలు తప్ప మరేమీ ఎరగని ఒక వెర్రి వెధవ ఉంటాడు. అంటే వాడే హీరో అని మనం అర్థం చేసుకోవాలి.
పాపం వాడి జీవితంలో ఒక ఆనందం, సుఖం ఏమీ ఉండవు.
ఎంతసేపూ వాడు పని చేసే హోటల్ లో వంట గది తప్ప మరేమీ తెలియదు. అక్కడ పని చేసే వెయిట్రెస్ తో ప్రేమలో పడతాడు. అదేమో వీడిని పట్టించుకోదు. వాడికేమో వాడి ప్రేమ ఆమెకి చెప్పాలి అంటే భయం.
చివరికి ఇవన్నీ తట్టుకోలేక ఆ..త్మ..హ..త్య చేసుకుని చావాలి అని ఫిక్స్ అయ్యి చచ్చే టైమ్ లో ఒకడు వాడి ముందు ప్రత్యక్షం అయ్యి తాను దయ్యాన్ని అని, ఎలాగా చావాలని ఫిక్స్ అయ్యావ్ కాబట్టి చనిపోయాక వాడి ఆత్మను తనకి ఇమ్మని అడుగుతాడు. దానికి బదులుగా వాడికి ఏడు కోరికలు తీరుస్తా అంటాడు.
ఈ దయ్యం గాడికి ఒక కథ ఉంటుంది.
ఆ దయ్యం గాడు తమ బాస్ అని ఒక వందకోట్ల ఆత్మలు ఒప్పుకుంటే ఆ దయ్యం గాడికి స్వర్గంలో మాంఛి పదవి దక్కుతుంది. అందుకని వీడు ఇలా చచ్చే ప్రతీ వాడి దగ్గరకి వెళ్లి ఇలా వాళ్ళ ఆత్మని తనకి బానిసలా చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు.
నువ్వు దయ్యానివని నమ్మకం ఏంటి అని అడిగిన హీరోతో ఒక ట్రైల్ వరం కోరుకోమంటాడు. మన వెర్రి వెంగళప్ప వెటకారంగా ఒక ఐస్ ఫ్రూట్ కావాలంటాడు. ఆ చుట్టు పక్కల ఎక్కడా దొరకదు అని వాడి ఉద్దేశ్యం. కానీ ఆ దయ్యం గాడు కాస్తా వాడికి ఐస్ ఫ్రూట్ ఇస్తాడు.
దానితో హీరోకి వాడు నిజంగా దయ్యమేనని అర్థం అవుతుంది. ఆ దయ్యం గాడు హీరోకి ఏడు కోరికలు తీరుస్తా అంటాడు.
దానితో హీరో ఈ ఏడు వరాలతో ఎలాగైనా తన లవర్ ని పడేయాలి అని ఫిక్స్ అవుతాడు.
అయితే అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్టు వాడి ప్రతీ వరం వాడికి రివర్స్ లో కొడుతూ ఉంటుంది.
ఆఖరికి ఆరో వరంగా తను ఆమెతో ఇరవై నాలుగు గంటలూ కలిసి ఉండాలి, తమను ఎవరూ డిస్టర్బ్ చెయ్య కూడదు అని ఒక వరం కోరుకుంటాడు.
అంతే ఆ దయ్యం గాడు మన హీరోని, వాడి లవర్ ని ఇద్దర్నీ “నన్” ల కింద మార్చేసి ఒక చర్చ్ లాంటి చోట పడేస్తాడు.
ఇక హీరోకి ఏమీ చేయలేని స్థితి అర్థం అయ్యి ఏడో వరం అడుగుతాడు.
అయితే దయ్యం గాడు ఆల్రెడీ ఏడు వరాలు అయిపోయాయి. మొదట్లో ఐస్ ఫ్రూట్ అడిగావు కదా. అది కూడా ఒక వరమే అంటాడు.
చివరికి ఏమీ చేయలేక దయ్యం కూడా తనకి ఏమీ సాయం చేయలేదు అని, తన దరిద్రాన్ని అర్థం చేసుకుని తన ప్రయత్నాలు తాను చేసుకుంటా అని అక్కడ నుండి పోతాడు.
చివరికి ఆ అమ్మాయి ప్రేమని ఎలా సాధించాడు అన్నది ఈ సినిమా.
ఈ సినిమా 1967 లో వచ్చింది. మాంఛి హిట్ అయింది. మళ్ళీ ఇదే సినిమా, ఇదే పేరుతో 2000 లో Elizabeth Harley (షేన్ వార్న్ పెళ్ళాం), Brendan Fraser (The Mummy సినిమా హీరో) తో మళ్ళీ రీమేక్ చేశారు.
అది కూడా హిట్ అయింది.
PS: ఈవేళ ఈ సినిమా గుర్తు రావడానికి, ఈ పోస్ట్ రాయడానికి కారణం, 1967 లో వచ్చిన సినిమాలో ఒక మెయిన్ రోల్ చేసిన “Raquel Welch” అనే ఒక నటి నిన్న చనిపోయింది.
నటి అంటే ఏదో మాములు నటి అనుకున్నారు.
“One Million Years B.C.” అనే ఒక సినిమా పోస్టర్ మీద కేవలం ఈవిడ ఫోటో వేసి అమ్మేశారు.
మిగతా టెక్నికల్, పాత్రలు, పాత్ర ధారులు ఈ పోస్టుకు అనవసరం. కాబట్టి రాయడం లేదు.