Nayanthara-on-Instagram

ఈ రోజుల్లో ఒక సినిమా తియ్యడమే కాదు జనాలకి తెలిసేలా రిలీజ్ చేయడం కూడా కష్టమే. చిన్న సినిమాకి అయినా, పెద్ద సినిమాకి అయినా వాటి స్థాయికి తగ్గ ఓపెనింగ్స్ రావాలి అంటే ప్రచారం కూడా ముఖ్యమే. అందుకే బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అందరూ సినిమా విడుదల కి ఒక రెండు వారాల ముందు నుండే ప్రచారం చేస్తూ ఉంటారు.

మెయిన్ స్ట్రీమ్ మీడియా కి ఇంటర్వ్యూ లతో బాటూ, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్  కి కూడా ఇంటర్వ్యూ లు ఇస్తూ ఉంటారు. ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ల నుండి కార్తికేయ,  కిరణ్ అబ్బవరం లాంటి అప్ కమింగ్ హీరోల తో సహా అందరూ తమ బడ్జెట్ స్థాయికి తగిన యాంకర్స్ ని పెట్టుకుని ఇంటర్వ్యూ లు ఇస్తూ ఉంటారు.

ఇక రాజమౌళి లాంటి డైరెక్టర్ అయితే సినిమా కి కొబ్బరి కాయ కొట్టినప్పటి నుండీ కూడా తన హీరో, హీరోయిన్స్ తో సందర్భాన్ని బట్టి ప్రమోషన్ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటాడు.

కానీ ఒక్క హీరోయిన్ మాత్రం ఇందుకు మినహాయింపు. ఆమె ఎవరో కాదు లేడి ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన నయన తార. దాదాపు గా ఎనిమిదేళ్ళు గా ఆమె తన ఏ సినిమా ప్రమోషన్స్ కి గానీ, ఫంక్షన్ లకి గానీ అటెండ్ అవడం లేదు. అగ్రిమెంట్ చేసుకునే సమయం లోనే ఆ విషయం చాలా క్లియర్ గా చెప్తుందిట.

ఆమె వేరే హీరోల సినిమాలో హీరోయిన్ గా చేసిన సినిమాలకే కాదు, కేవలం తాను మాత్రమే చేసిన “కోకిల,  డోరా, ఐరా, నేత్రికన్” లాంటి సినిమాలకి కూడా ఎక్కడా ప్రమోషన్ లకి రాలేదు, ఇంటర్వ్యూ లు ఇవ్వలేదు. కనీసం సోషల్ మీడియాలో అకౌంట్ లు కూడా సరిగ్గా మెయింటైన్ చెయ్యదు.

కేవలం 2022 రిలీజ్ అయిన “Kaathuvaakula Rendu Kaadhal” అనే సినిమాకి మాత్రం ప్రచారం చేసింది. కారణం ఆ సినిమా దర్శకుడు తన భర్త విఘ్నేశ్ శివన్ కావడం, పైగా అది తన సొంత సినిమా కావడమే. అలాంటిది హఠాత్తుగా Instagram లో పిల్లల ఫొటోలతో సహా ప్రత్యక్షం అయింది. 

నయన తార ఇటీవల షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే ఒక సినిమాలో చేసింది. తన Instagram అకౌంట్ లో తమ పిల్లల ఫోటోల కన్నా ముందే జవాన్ పోస్టర్ పెట్టింది కాబట్టి ఆ సినిమా ప్రమోషన్స్ కోసం అకౌంట్ ఓపెన్ చేసింది అన్నమాట. బహుశా బాలీవుడ్ లో ఉన్న కండిషన్స్ ని బట్టి ఇంటర్వ్యూ లకి వచ్చినా కూడా రావచ్చు.