Thieves

ఈ ఫోటోలో కనబడే అతని పేరు “Lamberto Maggiorani”.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక సూపర్ హిట్ సినిమాలో “హీరో”. ఆ సినిమా పేరు “Bicycle Thieves”. 1948 ప్రాంతంలో రిలీజ్ అయింది. ఇటాలియన్ సినిమాలు చూడాలి అనుకునే వాళ్ళు ఈ సినిమాతోనే మొదలు పెట్టాలి అని ఒక నానుడి.

దాదాపు అందరూ కొత్త వాళ్ళతో తీసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి అందరికీ పేరు తెచ్చింది. అందరితో పాటూ ఇతను చేసిన పాత్రకి, ఇతనికి కూడా మంచి పేరు వచ్చింది.

అక్కడే కథ మలుపు తిరిగింది.

ఇతను పని చేసే ఫాక్టరీ లో నష్టం వచ్చి కొంత మందిని తీసేయాలి అన్నప్పుడు ఇతను ఎలాగా సినిమా నటుడు అయిపోయాడు, లక్షలు సంపాదిస్తున్నాడు కదా అని వేరే వాళ్ళ బదులు ఇతన్ని ఫాక్టరీ యాజమాన్యం తీసేసింది.

లక్షలు అంటే ఎన్నో అనుకున్నారు. ఈ సినిమాకి గాను ఇతనికి ఇచ్చిన పారితోషికం ఇటాలియన్ కరెన్సీ లో “ఆరు లక్షల lire” అంటే కేవలం వెయ్యి డాలర్లు. ఒక ఇల్లు కొనుక్కోవడం తో ఆ డబ్బులు ఎన్నాళ్ళో రాలేదు. త్వరగానే ఖర్చు అయిపోయాయి.

కారణం ఈ సినిమాలో చూపించిన ఒక సీన్ ప్రకారం సినిమా పోస్టర్లు అంటించే మనిషికి నెలకి పదిహేను వేల lire లు. ఒక పాత సైకిల్ 7500 lire లు. అంటే ఈ లెక్కన ఆరు లక్షల లైర్ లు ఎన్ని రోజులు వస్తాయి.

మెల్లిగా డబ్బులు అన్నీ అయిపోవడం మొదలు పెట్టాయి.

తనకు సినిమా పరంగా మంచి పేరు అయితే వచ్చింది కానీ ఆ పేరు తగిన అవకాశాలు తేలేక పోయింది. పైగా ఫ్యాక్టరీ లో ఉద్యోగం కూడా పోయింది. అందువల్ల మళ్లీ లేబర్ గా పని చేస్తూ సినిమా అవకాశాల కోసం ట్రై చేయడం మొదలు పెట్టాడు.

కానీ అవి అంత సక్సెస్ కాలేదు.

మొదటి సినిమాలోనే హీరోగా చేసిన ఇతను తర్వాత చిన్న చిన్న గుర్తింపు లేని పాత్రలు వేసుకుని, వాళ్ళు ఇచ్చినంత పుచ్చుకోవాల్సి వచ్చింది.

ఆఖరికి ఇతన్ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు “Vittorio De Sica” కూడా తను తర్వాత తీసిన సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ లు వేసే క్యారక్టర్స్ ఇచ్చాడు తప్ప గుర్తింపు వచ్చే పాత్రలు ఇవ్వలేదు. చివరకు ఎన్నాళ్ళు ట్రై చేసినా కూడా తనకి మొదట వచ్చినట్టు మరో గుర్తింపు తెచ్చే పాత్ర రాలేదు.

చివరకు అదే అసంతృప్టి తో తన 73 వ ఏట మరో లీడ్ రోల్ చెయ్యకుండానే, మరో సక్సెస్ చూడకుండానే కన్ను మూశాడు.

#onefilmwonder
#bicycleThieves

See less