Amigoes

అమిగోస్.!

ఎవరివైనా సమాధులు తవ్వితే చరిత్ర దొరుకుతుంది.
కానీ నా చరిత్ర తవ్వితే సమాధులు దొరుకుతాయి.

ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్.
———————****************——————
సిద్దార్థ్ (హైదరాబాద్ కళ్యాణ్ రామ్) అని సరదాగా ఉండే ఒక కుర్రాడు. అతనికో మంచి ఫ్యామిలీ. మంచి బిజినెస్. అంతా బావుంది అనుకునే టైమ్ లో సిద్దార్థ్ కి ఒక వెబ్ సైట్ కోసం తెలుస్తుంది.

అదే “Doppelgangers”.

అంటే అచ్చం మనలాగే ఉండే వ్యక్తుల్ని వెతికి పరిచయం చేసే వెబ్ సైట్ అన్నమాట.

ఒకే తల్లి కడుపున పుట్టి ఒకేలా ఉండే వాళ్ళని కవలలు అంటారు. పోనీ ఒకే తల్లికి పుట్టక పోయినా, ఒకే వంశంలో పుడితే కొద్దో గొప్పో కొద్దిగా పోలికలు కలిసే అవకాశం ఉండచ్చు.

మరి ఈ doppelganger అంటే ఏమిటి.?

వీళ్ళ మధ్య “రూపం” తప్ప మరే సంబంధం ఉండదు. తల్లిదండ్రులు, కులం, మతం, ప్రాంతం ఇవేమీ వీళ్ళు ఒకే రకమైన రూపం కలిగి ఉండటానికి కారణం కాదు.

బుర్రలో తన doppelganger ఎవరో, ఎక్కడుంటాడో, అసలున్నాడో లేదో తెలుసుకోవాలని పురుగు దొలిచేస్తూ ఉండటంతో ఇక ఆగలేక ఆ సైట్ లో రిజిస్టర్ అయ్యి తన ఫోటోలు అప్లోడ్ చేస్తాడు.

సినిమా రివ్యూ పోస్ట్ పెట్టిన తర్వాత లైకులెన్నొచ్చాయో మాటిమాటికీ చూసుకునే రివ్యూయర్ లాగా మాటిమాటికీ తనలాగా ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసుకుంటూ ఉంటాడు.

మొత్తానికి అతని ఎదురుచూపు ఫలించి ఒక రెండు రోజులు పోయాక ఆ వెబ్ సైట్ లో తన లాగే ఉన్న మరో బెంగళూర్ “కళ్యాణ్ రామ్” మంజునాథ్ హెగ్డే తగులుతాడు.

ఇద్దరూ ఒకసారి మీట్ అవుదాం అనుకుంటారు. అయితే Hyderabad లో కలవాలో బెంగళూర్ లో కలవాలో డిసైడ్ అయ్యే లోగా వీళ్ళిద్దరికీ మరో మెసేజ్ వస్తుంది.

అదే “కోల్కతా కళ్యాణ్ రామ్” మైఖేల్.

అతను కూడా వీళ్ళ లాగే ఉండే మరో doppel ganger అన్న మాట.

ఏదో వందో రెండొందలో వ్యూస్ టార్గెట్ చేసి పెట్టిన యూట్యూబ్ వీడియో వైరల్ అయిపోయినట్టు తనలాంటి వాడు ఒకడ్ని కలుద్దాం అని ఆశపడిన సిద్దార్థ్ కి తనలాంటి వాళ్ళు ఏకంగా ఇద్దరున్నారు అనే సరికి ఆశ్చర్య పోతాడు.

ముగ్గురూ ప్లాన్ చేసుకుని గోవాలో కలుస్తారు.

సరదాగా ఎంజాయ్ చేస్తారు.

ఈలోగా సిద్దార్థ్ కి ఉన్న ఒక సమస్య కోసం మైఖేల్ కి తెలుస్తుంది. అదే అతని పెళ్లి సమస్య.

ఒకమ్మాయి ని చూసి ఇష్ట పడతాడు. అయితే ఆ అమ్మాయికి ఒక విచిత్రమైన కోరిక ఉంటుంది. అది తీరాలి అంటే ఒకడి వల్ల కాదు, కచ్చితంగా ముగ్గురు మనుషులు ఉండాలి. అది కూడా ఒకేలా ఉండాలి.

ముగ్గురూ ఒకేలా ఉన్నారు కాబట్టి సిద్దార్థ్ ఒక నాటకం ఆడి ఆ అమ్మాయిని మెప్పించి పెళ్ళికి ఒప్పిస్తాడు.

పెళ్లి సెటిల్ అయింది కాబట్టి మళ్ళీ పెళ్లి టైమ్ కి వస్తాం అని ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోదామని బయలుదేరుతారు.

సరిగ్గా ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిన మంజునాథ్ ను పోలీసులు అరెస్ట్ చేసి లోపల పడేస్తారు.

ఇక్కడ దాకా ఏదో నార్మల్ గా, కామెడీగా సాగిపోయే సినిమా ఇక్కడ నుండి వేరే ట్విస్ట్ తీసుకుంటుంది.

సిద్దార్థ్ బిజినెస్ మ్యాన్ అని మొదట్లోనే తెలిసిందే.
కానీ ఈ మంజునాథ్, మైఖేల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి. ప్రత్యేకంగా మంజూ నే అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి.?

అసలు ఈ మంజు, మైఖేల్ సిద్దార్థ్ జీవితం లోకి రావడానికి కారణం ఎవరు.? ఇవన్నీ మిగతా కథ.

ఇక్కడ దాకా స్టోరీ చెప్పేయడానికి కారణం సినిమాలో ముగ్గురు కళ్యాణ్ రామ్ లు ఉన్నారని తెలిసిందే. పైగా తమ సినిమా కాన్సెప్ట్ కూడా Doppelganger అనే కాన్సెప్ట్ మీద తీశామని ఒక ఇంటర్వ్యూలో వాళ్ళే చెప్పుకున్నారు. కాబట్టి అసలు ట్విస్ట్ లు అన్నీ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయి.

నిజానికి ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజ్ మంజునాథ్ పాత్ర. అది లేకపోతే ఇది కూడా ఏదో మామూలు డ్యుయల్ రోల్ రాముడు – భీముడు, సూపర్ స్టార్ కృష్ణ గారి మానవుడు – దానవుడు, రౌడీ అల్లుడు, దొంగ మొగుడు, హెలో బ్రదర్, ప్రభాస్ బిల్లా సినిమాల ఫార్మాట్ లో వచ్చిన మరో సినిమా లా ఉండేది.

ఈ సినిమాలో ఉన్న మరో గుడ్ పాయింట్ ఉన్నవి రెండే పాటలు, ఒక BGM. అందువల్లే సినిమాకి అడ్డం లేకుండా ఉంటాయి.

వాటిలో ఒకటి దర్మక్షేత్రం లో ఇళయరాజా రీమిక్స్ “ఎన్నో రాత్రులొస్తాయి”. రెండో పాట ముగ్గురూ గోవాలో ఎంజాయ్ చేసేటప్పుడు వస్తుంది. పాట సరిగ్గా గుర్తు లేదు.

ఇక మూడోది Monster అనే BGM.

విచిత్రంగా ఒక కమర్షియల్ సినిమా లో అతి తక్కువ పాటలు ఉన్నది ఇదే అనుకుంటా.

అన్నట్టు ఈ సినిమాకి పెద్దగా పబ్లిసిటీ చేసినట్టు ఎక్కడా కనబడలేదు. ఎంతసేపూ ఆ ఎన్నో రాత్రులొస్థాయి గానీ అనే పాట మాత్రమే యూట్యూబ్ లో వినబడేది.

బహుశా అనుకోకుండా ఒకేసారి వచ్చిన “వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి” సినిమాల హడావిడిలో ఉన్న మైత్రి మూవీస్ వాళ్ళు సంక్రాంతి హడావిడిలో పడి కొద్దిగా లేట్ గా ఈ సినిమా రిలీజ్ పనులు మొదలు పెట్టారేమో.

అమిగోస్ కి ఆ మాత్రం అయినా బజ్ వచ్చింది అంటే అప్పటికే బింబిసార సినిమా హిట్ ఊపు మీదున్న కళ్యాణ్ రామ్ వల్లే.

కొత్త కొత్త కథలు, కొత్త దర్శకులతో సినిమాలు చేయడం కోసం నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడూ ముందే ఉంటారు అన్న విషయం తెల్సిందే.

డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి ఇంతకు ముందు ఏమైనా సినిమాలు తీసారో లేదో తెలియదు కానీ “అసాధ్యుడు, అతనొక్కడే, పటాస్, బింబిసార” సినిమాల ద్వారా కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఈ సినిమా తో మరో డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్టే చెప్పుకోవచ్చు.

#amigoes
#kalyanram
#nandamuri
#jrntr
#doppelganger

See less