Sir

One of the best movies in recent times.

“కస్టమర్లని” తన వైపుకి తిప్పుకొని తమ “బిజినెస్” పెంచుకుని అవతలి వాళ్ళ “ఫ్రీ సర్వీస్” దెబ్బ కొట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఒక “బిజినెస్ మ్యాన్” ని, క్వాలిటీ కీ, కాసులకీ సంబంధం లేదు అని అడ్డుకున్న ఒక “టెక్నీషియన్” స్టోరీ ఇది.

ధనుష్ కి ఉన్న ఒక గొప్ప అడ్వాంటేజ్ స్క్రీన్ మీద “వయసు కనబడక పోవడం”.

దాన్ని సరిగ్గా వాడుకున్నాడు కాబట్టే “కుర్ర లెక్చరర్” గా కాదు “కుర్ర ట్యూటర్” గా స్క్రీన్ మీద సరిగ్గా సెట్ అయ్యాడు. ఇంటర్ పిల్లలతో కలిసిపోగలిగాడు. అప్పుడే సముద్రఖని “కుర్రాడిని” పంపాడు అన్న ఫీల్ వచ్చేది. అదే కొంచెం వయసు కనబడినా కూడా ఎవరో అనుభవజ్ఞుడు అయిన లెక్చరర్ ని పంపిన ఫీల్ వచ్చేది.

నిజానికి ఈ సినిమా కానీ ఎవరైనా పెద్ద వయసున్న హీరోతో తీస్తే ఈ ఫీల్, ఈ ఫ్లేవర్ వచ్చేది కాదు. పెద్ద NTR చేసిన “బడి పంతులు” లాగానో, చిరంజీవి చేసిన “మాస్టర్” లాగానో, మొన్నొచ్చిన విజయ్ “మాస్టర్” లాగానో అయిపోయేది.

అతనికి ఉన్న తక్కువ వయసు లుక్ వల్లే ఆ మ్యాజిక్ వచ్చింది.

ఇక గురూజీ సెలక్షన్ “సంయుక్త మీనన్” కోసం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కూల్ గా చేసుకుంటూ పోయింది. భీమ్లా నాయక్ తర్వాత తెలుగులో ఇదే అనుకుంటా.

ఈవిడ నటనలో మరో కోణం చూడాలి అంటే మలయాళం లో ఒక “ఎరిడా” సినిమా ఉంటుంది. నాజర్ తో చేసిన సినిమా. అది చూడండి.

రెండు పాటలున్నాయో, మూడు పాటలున్నాయో సరిగ్గా గుర్తు లేదు. అలా కలిసి పోయాయి.

ఇక “మాస్టారు మాస్టారు” పాట అందరికీ తెలిసిందే.

ఇక డైలాగ్స్ అయితే చాలా చాలా సింపుల్ గా ఉంటాయి.

తాగింది చాలు ఆపండి సార్.!

విద్యనేది గుళ్ళో ప్రసాదంలా అడిగిన వాళ్ళందరికీ ఇవ్వాలి కానీ ఫైవ్ స్టార్ హోటల్ లో డిష్ లా డబ్బున్న వాడికి మాత్రమే అందుబాటులో ఉండకూడదు.!

సముద్రఖని క్యారక్టర్ అల వైకుంఠపురం లో పాత్రకి తమ్ముడి లా ఉంటుంది. అక్కడా లాక్కోడమే. ఇక్కడా లాక్కోడమే.

ఆది నీ, ఆ పక్కబ్బాయినీ కామెడీ కోసం తీసుకున్నారు అనుకుంటారు. కానీ కాదు. దోమలు కుట్టి ఆరోగ్యం పాడైంది అనే చిన్న కారణంతో ఒకళ్ళు వెళ్లిపోతే, అతడికి వచ్చిన కష్టం చూసి భయపడి మరొకళ్ళు వెళ్ళిపోయారు.

కానీ ప్రాణాల మీదకు వచ్చినా కూడా సార్ అక్కడ నుండి ఒక్కడుగు కూడా వెనక్కి వెయ్యలేదు అని తేడా చూపించడం కోసం ఇద్దర్నీ తీసుకున్నారు అనిపించింది.

(ఈ రెండు పాత్రలూ ఇందుకు పెట్టామా అని గురూజీకి తెలుసో లేదో.)

వెంకీ అట్లూరి సినిమాల్లో సెకండ్ హాఫ్ ఎక్కడో లండన్ లో జరుగుతుంది అని జోక్ ఉందిట. ఇక్కడ కనీసం ఊరు కూడా దాటలేదు. నిజానికి సినిమా బావుంది కాబట్టి ప్రత్యేకంగా డైరెక్షన్ కోసం చెప్పాల్సిన అవసరం లేదు.

సూపర్ 30 లా ఉంది అని, రఘువరన్ B.Tech లో ఇళ్ళు కట్టే పని ప్లేస్ లో ఇక్కడ పిల్లలకి చదువు చెప్పే పని పెట్టారు. ఆ సినిమాలో కూడా ప్రభుత్వ కాంట్రాక్ట్ కదా అని ఎలా పడితే అలా చేయకూడదు అని అడ్డంగా వాదిస్తాడు. ఇక్కడ కూడా ప్రభుత్వ కళాశాల కదా అని ఎలా పడితే అలా చదువు చెప్ప కూడదు అని వాదిస్తాడు.

మొత్తానికి సినిమా అద్భుతంగా లేకపోయినా ఇటీవల వచ్చిన వాటిలో కొంచెం కాదు చాలా చాలా బెటర్ సినిమా అని చెప్పచ్చు.

#సార్#ధనుష్

error: Content is protected !!