Jee-Karda

(18+ Web Series)

ఒక వీడియో క్లిప్ పోర్న్ ఫిలిమ్ లోదా వెబ్ సిరీస్ లోదా అని ఎలా డిసైడ్ చెయ్యాలి.?

అది ఏ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యింది అన్న దాన్ని బట్టి, దానిలో చేసిన ఆర్టిస్ట్ లకి పెట్టిన బడ్జెట్ ను బట్టి.

అంటే పెద్ద స్టార్స్, పెద్ద OTT ల్లో రిలీజ్ అయితే అది వెబ్ సిరీస్ అన్నమాట.

అదే ఊరూ పేరూ లేని ఆర్టిస్ట్ లు నటించి, కార్న్ హబ్ లాంటి వాటి ల్లో రిలీజ్ అయితే అది పోర్న్ ఫిలిమ్ అన్నమాట. మిగతా అంతా same to same.

మొన్న రిలీజ్ అయిన రాణా నాయుడు, నిన్న రిలీజ్ అయిన “Jee Karda”.

వెంకటేష్, తమన్నా గానీ లేకపోతే ఈ రెండూ హై బడ్జెట్ సీ గ్రేడ్ సినిమాల కేటగిరీ లోకి పోయేవి.

బురదలో దొర్లే పంది జోలికి వెళితే దాని బురద మనక్కూడా అంటుకున్నట్టు హాయిగా మంచి సినిమాలు చేసుకునే వెంకటేష్ కూడా వెబ్ సిరీస్ జోలికి వెళ్ళి బురద పూసుకున్నాడు.

ఇక Jee Karda లో అయితే ఇంకో గంటలో పెళ్ళి ఉందనగా, పెళ్ళి కొడుకుతో చిన్న మాట పట్టింపు వచ్చిందని టెర్రస్ మీద కి వచ్చి మూడాఫ్ అయిన తమన్నా గారిని ఆవిడ “బాయ్ బెస్టీ” రూమ్ లో ఓదార్చే సన్నివేశం, ఆ ఓదార్పు తో ఆవిడ మామూలుగా మారి మళ్ళీ పెళ్ళికి రెడీ అయ్యి పెళ్ళి చేసుకున్న సన్నివేశం.

పైగా ఆ పెళ్ళి కొడుకు, ఆ బాయ్ బెస్టి, ఆ తమన్నా ముగ్గురూ చిన్నప్పటి నుండీ బెస్ట్ ఫ్రెండ్స్.

నా మొహం మండ.!

ఒక ఏడుగురు స్నేహితులు, వాళ్ళ జీవితాల్లో ఎదురయ్యే సంఘటనలు, ఇదే స్టోరీ.

ఆ సంఘటనలు ఎంతసేపూ “ఒకటే పని” కోసం ఎదురవుతూ ఉంటాయ్. ఆ “పని” లోనే వాళ్ళు ఆనందం, బాధ వెతుక్కుంటూ ఉంటారు.

చివరికి వాళ్ళ జీవితాలు ఎలా తగలడ్డాయి అన్నదే ఈ సీరీస్. పొరపాటున కూడా ఈ సీరీస్ పిల్లలకి కనబడనివ్వకండి.

I think it’s time to bring censor into OTTs.

ఇక మరో అద్భుతం “సైతాన్”. జస్ట్ ట్రైలర్ చూసా.

సిరీస్ పూర్తిగా చూశాక అప్పుడు రాస్తా.