హీరో ఒక అనాథ. అతన్ని చిన్నప్పుడే ఒక డాన్ చేరదీస్తాడు. ఆ డాన్ కి ఒక కొడుకు ఉంటాడు. అయినప్పటికీ హీరో అంటే డాన్ కి చాలా ఇష్టం. ఆ హీరోకి పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉంటారు. కానీ ఒకరోజు అనుకోకుండా ఆ డాన్ కొడుకు సాక్ష్యంగా ఉన్నాడని ఆ హీరో కుటుంబం జోలికి వెళ్ళి ఒక సభ్యుడిని చంపెయాల్సి వస్తుంది.

తన కుటుంబ సభ్యుడిని చంపేసిన డాన్ కొడుకు మీద హీరో పగ పెంచుకుని వాడిని చంపేయాలని అనుకుంటాడు. దాంతో హీరోకి డాన్ కి మధ్య క్లాష్ స్టార్ట్ అవుతుంది. హీరో గానీ తలుచుకుంటే ఏం చెయ్యగలడో తెలిసిన డాన్ తన కొడుకు కోసం ఇగో ని పక్కన పెట్టి అప్పటి దాకా తను శత్రువులుగా భావించిన వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ దగ్గర తన కొడుకుని భద్రంగా దాచి హీరోని లేపెయాలి అని చూస్తాడు. అంతే కాకుండా ఆ పని ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కి అప్పగిస్తాడు. రెండు సార్లు ఆ కిల్లర్ హీరో ని చంపడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతాడు. ఈసారి ముచ్చటగా మూడో సారి ఫెయిల్ అవ్వకూడదు అని హీరో కోసం వెతుకుతూ ఉంటాడు.(ఈ పార్ట్ దాకా గుర్తు పెట్టుకోండి.)

కానీ హీరో ఒక రాత్రి వచ్చి బాడీ గార్డ్ లతో సహా డాన్ ని లేపెస్తాడు. మెయిన్ డాన్ పోవడం తో పిల్ల డాన్ ని కాపాడటం కష్టం అని తెలిసిన మిగతా డాన్ గ్యాంగ్ డాన్ కొడుకు ఎక్కడున్నాడో చెప్పేస్తారు. దాంతో హీరో అక్కడకు వెళ్లి డాన్ కొడుకుని బాత్ టబ్ లో స్నానం చేస్తుంటే చంపేస్తాడు. దాంతో హీరో పగ తీరిపోతుంది.

అక్కడ నుండి మిగిలిన తన కుటుంబ సభ్యులతో హీరో ఎవరికీ తెలియని ప్లేస్ కి వెళ్లి సేఫ్ గా మిగతా జీవితం గడపాలని అనుకుంటాడు. కానీ అంతా బావుంది అనుకుంటున్న సమయంలో రెండు సార్లు ఫెయిల్ అయిన కిల్లర్ కి హీరో ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. దాంతో అక్కడకు వచ్చి హీరో ని కాల్చి పడేసి, హీరో చేతిలో తనుకూడా చనిపోతాడు.చనిపోయే ముందు హీరో తన కొడుకు దగ్గర తను మాత్రం ఇలా డాన్ ల జోలికి అదీ వెళ్లకుండా బుద్ధిగా చదువుకుని, మంచిగా ఉండాలి అని మాట తీసుకోవడం తో కథ ముగుస్తుంది.

మధ్యలో ఒకచోట గుర్తు పెట్టుకోమని చెప్పాకదా. అక్కడ దాకా చదివాకా ఎవరైనా పవన్ కళ్యాణ్ సినిమా “పంజా” సినిమా గుర్తుకు వస్తే నా బాధ్యత లేదు.

టామ్ హ్యాంక్స్ ప్లేస్ లో పవన్ కల్యాణ్, డేనియల్ క్రెగ్ ప్లేస్ లో అడవి శేష్, పాల్ న్యూమాన్ ప్లేస్ లో జాకీ ష్రాఫ్, జుడ్ లా ప్లేస్ లో అతుల్ కులకర్ణి, హీరో ఫ్యామిలీ ప్లేస్ లో అంజలీ లావానియా, ఆలి, పెర్డిషన్ టౌన్ ప్లేస్ లో పలాస.

శ్యామ్ మెండీస్ తీసిన ఈ సినిమా 2002 లో వచ్చింది. నేను సింపుల్ గా రాసేసా కానీ సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. మరీ ముఖ్యంగా టామ్ హ్యంక్స్ గన్నట్టుకుని డాన్ ని వేసేయడానికి వచ్చే సీన్ అయితే సూపర్.

ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన Conrad L.Hill క్యాన్సర్ తో చనిపోవటం తో ఆయనకి అంకితం ఇచ్చారు. అంతే కాకుండా ఈ సినిమాకి బెస్ట్ సినిమాటోగ్రఫీ కింద ఆయనకి అవార్డ్ కూడా వచ్చింది. కాకపోతే అవార్డ్ టైమ్ కి ఆయన చనిపోవడంతో ఆయన కొడుకు ఆ అవార్డ్ తీసుకున్నాడు.ఈ సినిమాని 2006 లో పవన్ కళ్యాణ్ తో బాలూ అని, మళ్ళీ 2011 లో పంజా అని ఒకసారి తీశారు.

PS: ఆ సినిమాలో డాన్ కొడుగ్గా వేసిన డేనియల్ క్రేగ్ తర్వాత జేమ్స్ బాండ్ అయ్యాడు. అలాగే పంజా సినిమాలో డాన్ కొడగ్గా చేసిన అడవి శేష్ కూడా తర్వాత గూఢచారి సినిమాలో జేమ్స్ బాండ్ గా చేశాడు.

#RoadtoPerdition, #TomHanks, #PaulNewman, #JudeLaw, #JenniferJasonLeigh, #StanleyTucci, #DanielCraig, #SamMendes, #Periodcrimefilm

error: Content is protected !!