సినిమా కథల్లో రెండు రకాలుంటాయ్.

ఒకటి ఫిక్షన్, రెండు నాన్ ఫిక్షన్.

ఫిక్షన్ అంటే అసలు జరగనిది అంటే బాహుబలి టైప్ అన్నమాట. 

నాన్ ఫిక్షన్ అంటే మన చుట్టూ జరిగేవి, మనం నిత్యం చూసేవి.

మళ్ళీ ఈ నాన్ ఫిక్షన్ లో ముఖ్యంగా మూడు రకాలుంటాయి.

మన చుట్టూ నిత్యం జరిగే సంఘటనల మీద తీసేవి, హిస్టారికల్ ఈవెంట్స్ మీద తీసేవి, బయో పిక్స్.

బయోపిక్స్ అనేవి ఆ వ్యక్తీ జీవితం ఎలా ఉంటె అలా తీస్తారు. వాటిలో ఎక్కువగా పాజిటివ్ ఎలెమెంట్స్ చూపిస్తారు.

ఏ హిస్టారికల్ ఈవెంట్ సినిమా తీసినా కూడా చివరికి కథ సుఖాంతం అవుతుంది. ఒకవేళ కాకపోయినా ఏదో ఒక సంతృప్తికరమైన ఎండింగ్ ఇచ్చి ముగిస్తారు. ఉదాహరణకి టైటానిక్.

Zodiac మూవీ కోసం చెప్తా అని చెప్పి ఈ సోదంతా చెప్తున్నా అనుకుంటున్నారా. ఎందుకో ఆఖర్లో చెప్తా.

ముందు కథలోకి వెళ్ళిపోదాం.

1960 – 1970 ఒక చక్కని సాయంత్రం వేళ ఒక జంట కాని జంట కారులో వచ్చి ఒక చోట ఆగి కిందకి దిగకుండానే మాట్లాడుకుంటూ ఉంటారు.  హఠాత్తుగా ఒకడొచ్చి కాల్చి వెళ్ళిపోతాడు. 

ఈ సీన్ సినిమా మొదట్లోనే వస్తుంది. అవసరం అయితే రివైండ్ చేసుకుని, స్లో పాజ్ లో పెట్టుకుని మరీ చూడండి. ఎందుకో ఆఖర్లో చెప్తా.

ఆ కాల్పుల్లో ఆ అమ్మాయి చచ్చి పోతుంది. అబ్బాయి కొన ప్రాణాలతో కొట్టుకుంటూ ఉంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అమ్మాయిని మార్చురీకి, అబ్బాయిని ICU కి పంపిస్తాడు.

ఆ పోలీస్ ఎక్కడ నుండి వచ్చాడంటే ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసులకి కాల్ చేసి డీటెయిల్స్ చెప్తాడు. ఎన్ని డీటెయిల్స్ అంటే కాల్చిన గన్ తో సహా. అంటే అర్థం అయింది కదా అతనే కిల్లర్ అని. 

అంటే చంపేసి సింపుల్ గా కాల్ చేసి చెప్పేసాడు. 

సరిగ్గా ఒక నెల తర్వాత ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ (San Francisco Chronicle) కి ఒక కవర్ వస్తుంది. ఆ కవర్ లో నెల క్రితం జరిగిన హత్య తనే చేసానని, అందుకు సాక్ష్యంగా తనకి, పోలీసులకి మాత్రమే తెలిసిన కొన్ని నిజాలు అంటే ఎన్ని బులెట్స్ ఫైర్ చేసాడు, గన్ మోడల్ ఏంటి ఇలాంటివన్నీ రాసి పంపిస్తాడు. దాంతో పాటూ ఒక పేపర్ కూడా పంపిస్తాడు.

 ఆ పేపర్ లో ఒక పజిల్ ఉంటుంది. అది సాల్వ్ చేస్తే తన పేరు వస్తుందని రాస్తాడు.

వచ్చే ఎడిషన్ లో కనక ఈ పజిల్ రాకపోతే ఒక పన్నెండు మందిని మొహమాటం లేకుండా చంపేస్తానని, ఒక వేళ పేపర్లో వేస్తే తన పేరు తెలిసే అవకాశం ఉందని చెప్తాడు.  

చాలా తర్జన భర్జనల తర్వాత మొత్తానికి ఆ లెటర్ పబ్లిష్ చేద్దాం అని ఫిక్స్ అవుతారు. కాకపొతే కిల్లర్ అడిగినట్టు ఫ్రంట్ పేజీలో కాకుండా లోపలెక్కడో పబ్లిష్ చేస్తారు. దాంతో మరో ఇద్దర్ని చంపేసి మరో లెటర్ పంపిస్తాడు. దాన్లో తన పేరు కూడా చెప్తాడు.

ఇక్కడే కిల్లర్ పేరు “Zodiac” అని ప్రపంచానికి తెలుస్తుంది.

ఈలోగా పోలీస్ డిపార్టుమెంటు కూడా ఈ హత్యల్ని మాములు కోణంలో కాకుండా సీరియల్ హత్యల కోణంలో దర్యాప్తు చేయడం మొదలు పెడుతుంది.

ఆ పత్రిక లోనే రాబర్ట్ గ్రే స్మిత్ అనే ఒక కార్టూనిస్ట్ ఉంటాడు. వాడికి పజిల్స్ సాల్వ్ చేయడం సరదా. అందరూ ఆ పజిల్స్ సాల్వ్ చేసేస్తే కిల్లర్ డీటెయిల్స్ దొరికేస్తాయి అనుకుంటూ వెర్రి వెంగళప్పల్లా ట్రై చేస్తూ ఉనప్పుడు, ఆ పజిల్స్ అన్నీ చూస్తున్న, చేస్తున్న అతనికి Zodiac ఇచ్చే క్లూ ల్లో అతని డీటెయిల్స్ ఏమి లేవని అర్థం అవుతుంది.

అదే ఆఫీస్ లో “Paul Avery” అనే ఒక క్రైమ్ రిపోర్టర్ ఉంటాడు. రాబర్ట్ ఏదో ట్రై చేస్తూ ఉంటుంటే మొదట్లో పక్కన కూర్చుని జోక్స్ వేస్తూ ఉంటాడు. తర్వాత మెల్లిగా అతనితో కలిసి ఆ పజిల్స్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. 

మెల్లిగా Zodiac చేసే హత్యలు పెరుగుతూ ఉంటాయ్. జనాల్లో ఒక విధమైన ఆందోళన పెరుగుతూ ఉంటుంది. పోలీస్ డిపార్టుమెంటు ఈ కేసు కోసం “Dave Toschi” అధ్వర్యంలో ఒక టీం ని పెడుతుంది. కానీ ఏమీ ఫలితం ఉండదు.

ఇలా రెండు హత్యలు మూడు బెదిరింపులు కింద సాగిపోతున్న సినిమాలో ఒక చిన్న క్లూ దొరుకుతుంది.  అదేంటంటే Don Cheney అనే అతను తన ఫ్రెండ్ “Arthur Leigh Allen” సరిగ్గా Zodiac లాగా కొన్ని పదాలు వాడాడని దానివల్ల అనుమానంగా ఉందని ఉప్పందిస్తాడు.

Dave మరో ఇద్దరితో కలిసి విచారణకి వస్తాడు. వీళ్ళ అనుమానానికి తోడు  ఈ “Arthur Leigh Allen” సరిగ్గా కిల్లర్ ధరించిన షర్టు లోగో ఉన్న ఒక వాచీ పెట్టుకుని ఉంటాడు. అతడి చేతి రాతని కిల్లర్ పంపిన లెటర్స్ లో ఉన్న చేతి రాతతో పోల్చి చూస్తారు.

పైగా మర్డర్స్ జరిగినప్పుడు ఇతను ఆ దరిదాపుల్లో ఉన్నాడని తెలుస్తుంది. కానీ ప్రత్యక్షంగా ఇతనే హత్య చేసినట్టు ఉన్న ఆధారాలు ఏమీ ఉండవు.  చేతి రాత కూడా సరిపోలేదు.

ఇక ఉన్నది ఒకటే ఆధారం. అదే ఫ్రెండ్ దగ్గర చెప్పిన రెండు మూడు పదాలు. అవి సరిపోవు. దాంతో ఏమీ చేయలేక వదిలేయాల్సి వస్తుంది. 

దాన్ని ఆధారం చేసుకుని అరెస్ట్ చేయలేరు.

ఈలోగా ఈ Zodiac మన క్రైం రిపోర్టర్  Paul Avery ని చంపేస్తానని బెదిరిస్తూ లెటర్స్ రాస్తాడు. దాంతో భయపడి డ్రగ్స్ అలవాటు చేసుకుంటాడు. 

ఇతని సంగతి ఇలా ఉంటే ఈ కేసుని మొదటి నుండీ ఫాలో అవుతున్న కార్టూనిస్ట్ గ్రే స్మిత్ పరిస్థితి మరో విధంగా తయారవుతుంది. ఈ కేసు వెనక్కాల పడి తన ఉద్యోగ జీవితం, వ్యక్తిగత జీవితం రెండూ నాశనం అవుతాయ్. ఉద్యోగం పోతుంది. పెళ్ళాం పిల్లలు వదిలేసి పోతారు. అయినా కూడా ఆ కేసుని వదలడు.

ఒక చోట కిల్లర్ సినిమా మొదట్లో కార్లో ఉన్న ఒకమ్మాయిని చంపేసాడు కదా. గుర్తు పెట్టుకోమని చెప్పా గుర్తుందా. 

ఆ అమ్మాయి పేరు “Ferrin”.  ఈ Arthur Leigh Allen ఆ అమ్మాయి ఉన్న చోటే,  ఉండేవాడు అని కనిపెడతాడు. దాంతో అతనే Zodiac అని కార్టూనిస్ట్ గ్రే స్మిత్ గట్టిగా నమ్ముతాడు.

దాంతో Dave ని కలిసి కొన్ని విషయాలు చెప్తాడు. 

Allen ఒక చిన్న పిల్లని వేధించిన కేసులో అరెస్ట్ అవుతాడు. జైలు నుండి వచ్చిన వెంటనే హత్యలు జరుగుతూ ఉంటాయ్.

మళ్ళీ వేరే ఒక కేసులో అనుమానిస్తారు. హత్యలు ఆగిపోతాయ్. మళ్ళీ అంతా సైలెంట్ అయ్యింది అనుకున్న తర్వాత హత్యలు మళ్ళీ మొదలవుతాయ్. 

మళ్ళీ వేరే కేసులో అరెస్ట్ చేస్తారు. హత్యలు ఆగిపోతాయ్. నాలుగేళ్ళ తర్వాత రిలీజ్ అవుతాడు. మళ్ళీ హత్యలు మొదలవుతాయ్. 

ఇలా అన్నీ విన్నాక ఆ Allen ఏ ఈ హత్యలన్నీ చేస్తున్నాడని, అతనే Zodiac అనీ గ్రే స్మిత్ చెప్తాడు.

కానీ Dave అవన్నీ ఏదో కాకతాళీయం అని. వాటిని చూపించి కోర్టులో దోషిగా నిలబెట్టలేమని చెప్తాడు. చివరగా ఒక హత్య జరిగిన సమయంలో అతను ఆ పక్కనే ఉన్నాడని చెప్తాడు. ఎన్ని చెప్పినా కూడా కోర్టులో నిలబడవు అని Dave చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఇక ఏమీ చేయలేక గ్రే స్మిత్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. 

చివరికి కొన్నేళ్ళ తర్వాత ఒక హార్డ్ వేర్ షాపులో వర్క్ చేస్తున్న Allen ని గ్రే స్మిత్ చూస్తాడు. కానీ ఏమీ చేయలేడు. 

కొన్నేళ్ళ తర్వాత ఈ గ్రే స్మిత్ Zodiac మీద ఒక బుక్ రాస్తాడు. అదో బెస్ట్ సెల్లర్ గా ఉంటుంది.

సినిమా మొదట్లో ఒకడిని Zodiac కాల్చి పడేస్తే ICU లో జాయిన్ అయిన ఒకడు గుర్తున్నాడా.?

వాడి పేరు “Mike Mageau”. వాడు కాస్తా ఒక బుక్ లో చూసి Allen ని గుర్తు పట్టి అతనే తనని కాల్చింది అని గుర్తు పడతాడు.

ఇక్కడితో మనం చూస్తున్న సినిమా అయిపోతుంది.

(సరిగ్గా చూస్తే సినిమా మొదట్లోనే మొహం సరిగ్గా కనబడక పోయినా ఒక ఆకారం కనిపిస్తుంది. అందుకే ఆ సీన్ రెండు మూడు సార్లు జాగ్రత్తగా చూడమన్నాను.) 

ఇక్కడి నుండి కేవలం సమాచారం మాత్రమే ఉంటుంది.

దాంతో పోలీసులు కాస్తా Allen ని పట్టుకోడానికి పరుగెడతారు. కానీ అప్పటికే అతను హార్ట్ అటాక్ తో చనిపోయాడని తెలుస్తుంది. 

తర్వాత 2002 లో Allen DNA ని 33 ఏళ్ళ క్రితం Zodiac రాసిన లెటర్స్ లో దొరికిన Zodiac DNA తో మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసారు. కానీ మ్యాచ్ అవ్వలేదు.

చివరకి 2004 లో ఇక విచారణ అనవసరం అని ఆపేశారు.

ఇప్పటికీ ఈ కేసు ఇంకా ఓపెన్ గానే ఉంది. అంతే కాకుండా ఈ కేసులో ఇప్పటికీ “Arthur Leigh Allen” ఒక్కడు మాత్రమే అనుమానితుడు. 

ఇంకా విచిత్రం ఏంటంటే Allen చనిపోయిన తర్వాత నుండీ ఇలాంటి హత్యలు ఎక్కడా జరగలేదు, ఇలా బెదిరింపు ఉత్తరాలు కూడా ఎవరికీ రాలేదు. 

మొత్తానికి కొన్నేళ్ళ పాటు ఆ ఏరియాని గడగడ లాడించిన ఇంటిలిజెంట్ సైకో కిల్లర్ కథ ఇలా ముగిసిందా లేదా అనేది ఎవరికీ తెలియని బహిరంగ రహస్యం.

***********************************

ముందే చెప్పినట్టు ఇదేమీ ఫిక్షన్ కాదు లేదా సుఖాంతమైన బయో పిక్ కాదు.

కేవలం పేరుతోనే వెన్నులో వణుకు పుట్టించే ఒక కిల్లర్ కథ.!

ఒక పట్టువదలని ఒక కార్టూనిస్ట్ విక్రమార్కుడి కథ.!

వాడిని పట్టుకోవడానికి పోలీసులు, జర్నలిస్టులు, కార్టూనిస్టులు పడే తిప్పల కథ.! 

ఆప్తులని కోల్పోయిన వాళ్ళతో పాటూ, కిల్లర్ ఎదురుగా తిరుగుతున్నా కూడా ఏమీ చేయలేక పోతున్నాం అనే ఒక పోలీసు, కార్టూనిస్ట్ ల వ్యథ.!

సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవాళ్ళకి ఈ సినిమా ఒక మంచి ట్రీట్. కానీ ఇది అందరికీ నచ్చే సినిమా కాదు. కొంచెం ఓపికగా, సీరియస్ గా సినిమాలు చూసేవాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. కిల్లర్ ఎవరో తెలుసుకోవాలనే ఆత్రుత చివరిదాకా ఉంటుంది. సినిమా అయిపోయినా కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.

David Fincher దర్సకత్వం చేసిన సినిమాల్లో మూడో బెస్ట్ సినిమా అని చెప్పచ్చు. 

మొదటిది “Fight Club” అయితే రెండోది “Seven”.

నాలుగోది “The Social Network” అయితే అయిదోది “Gone Girl

error: Content is protected !!