మాములుగా ఒక సినిమాలో ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్ ఉంటారు. కానీ అందరూ దొంగ నా కొడుకులు ఉండే సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయ్.
అలాంటి ఒక సినిమాయే ఈ “Wild Things”
1998 లో వచ్చిన ఈ సినిమా ఒక మాములు సినిమా కాదు. ఎరోటిక్ క్రైమ్స్ జానర్ లో మొదటి వరసలో ఉండాల్సిన సినిమా.
స్పాయిలర్స్ ఉంటాయ్ కాబట్టి మిగతా స్టొరీ చదవి సినిమా చూడాలా లేక సినిమా చూసొచ్చి మిగతా స్టొరీ చదవాలా అనేది మీకే వదిలేస్తున్నా.
కథ లోకి వెళ్తే….
“Sam Lambordo” అనే ఒక టీచర్ మియామీలోని ఒక స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. హాయిగా జీవితం గడిచి పోతూ ఉంటుంది. అయితే ఒక రోజు అతని స్టూడెంట్ అయిన “Kelly Van Ryan” అనే అమ్మాయి “Sam” తనని పాడు చేసాడని కేసు పెడుతుంది.
ఇక్కడ నుండే అసలు కథ స్టార్ట్ అవుతుంది.
ఆ Kelly మామూలు అమ్మాయి కాదు. “Sandra” అనే ఒక మిలియనీర్ మహిళ కూతురు. బాగా పలుకుబడి కలిగిన మనిషి. కానీ అతను తప్పు చేసాడని బలమైన సాక్ష్యాలు దొరకవు. కేవలం kelly చెప్పిన మాటలు తప్ప. పోలీసులకి ఏం చేయాలో అర్థం కాదు.
చుట్టు పక్కల ఉన్న జనాలు, కొలీగ్స్ Sam ఆ నేరం చేసాడని బలంగా నమ్ముతూ ఉంటారు. దాంతో అతని జీవితం మొత్తం మారిపోతుంది.
ఈలోగా “Suzie Toller” అనే మరో స్టూడెంట్ కూడా “Sam” తనని పాడు చేసాడని కేసు పెడుతుంది.
దాంతో Kelly చేసిన ఆరోపణలకి బలం చేకూరుతుంది. దాంతో Sam ని తెచ్చి లోపల పడేస్తారు.
Sam తరపున వాదించడానికి “Kenneth Bowden” అనే ఒక లాయర్ ఒప్పుకుంటాడు. కేసు కోర్టుకు వస్తుంది.
అక్కడ Kelly అందరి ముందరా Sam తనని రేప్ చేసాడని చెప్తుంది.
Suzie ని కోర్ట్ లో Cross Examination చేసేటప్పుడు ఒక విషయం తెలుస్తుంది.
అదేమిటంటే ఒక ఏడాది క్రితం ఈ Suzie ఒక డ్రగ్ కేసులో ఇరుక్కుంటుంది. అప్పుడు సాయం చేయమని Sam కి ఫోన్ చేస్తుంది. కానీ అలాంటి విషయాల్లో తాను సాయపడనని Sam ఖరాకండీగా చెప్పేయడంతో వేరే విధంగా ఆ కేసు లో నుండి బయటికి వస్తుంది. కానీ అప్పటి నుండీ ఇతని మీద కక్ష పెంచుకుంటుంది.
ఇప్పుడు Kelly ద్వారా అవకాశం రావడంతో ఇలా తప్పుడు ఆరోపణలు చేసానని ఒప్పుకుంటుంది. అంతే కాకుండా Kelly కూడా Sam మీద తప్పుడు ఆరోపణలు చేసిందని కూడా బయటికి తెలుస్తుంది.
దాంతో కోర్టు ఇద్దర్నీ మందలించి వదిలేసింది. కానీ అప్పటికే ఈ కేసు వల్ల Sam ఉద్యోగం పోయింది. జైల్లో గడిపాడు. ప్రేమించిన అమ్మాయి వదిలేసింది. కోర్టు ఖర్చుల కోసం, లాయర్ ఫీజుల కోసం ఉన్న ఒక్క ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది.
ఇలాంటి పొజిషన్ లో ఉన్న Sam తన మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు “Kelly” మీద 8 మిలియన్ డాలర్లకి పరువు నష్టం దావా వేస్తాడు. ఇక తప్పక Kelly తల్లి Sandra ఆ డబ్బులు కడుతుంది.
కథ అక్కడితో మొదటి భాగం ముగుస్తుంది.
ఒక రేప్ కేసు ఇంత సింపుల్ గా తేలిపోవడం, Suzie మాట మార్చడం, Kelly తన తప్పుని ఈజీగా ఒప్పేసుకోవడం, Sam కి పరువు నష్టం ద్వారా 8.5 మిలియన్స్ రావడం తో ఈ కేసుని మొదటి నుండీ డీల్ చేస్తున్న డిటెక్టివ్ “ Ray Duquette” కి ఒక అనుమానం వస్తుంది. అదేంటంటే “Sam, Kelly, Suzie” ముగ్గురూ తోడు దొంగలేమోనని.
దానికి మరో కారణం కూడా ఉంది.
Kelly పేరు మీద దాదాపు పదిమిలియన్ల ఆస్తి ఉంది. కానీ ఆమె తల్లి చనిపోతేనే కానీ ఆమె పేరు మీదకి రాదు. లేదా ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఆ అస్తి వాడుకోవచ్చు. అంటే ఆ Kelly ఆమె తల్లి చనిపోయే వరకూ ఆగే అంత ఓపిక లేక ఇలా మిగతా ఇద్దరితో కలిపి ప్లాన్ చేసింది అని అర్థమవుతుంది.
ఆ విషయం మిగతా వాళ్లకి చెప్తే నవ్వుతారు. పైగా ఇలాంటి అనుమానాలు బయట పెడితే “kelly” తల్లి కోర్టుకు లాగుతుంది అని భయపెడతారు. కానీ ఆ డిటెక్టివ్ వెనక్కి తగ్గకుండా ముగ్గురి మీదా ఒక కన్నేసి ఉంచుతాడు.
విభజించి పాలించు అనే ట్రిక్ ప్లే చేయాలని ప్లాన్ చేసి ముగ్గురిలో కొద్దిగా అమాయకంగా కనబడే “Suzie” ని కలిసి, ముగ్గురూ కలిసి వేసిన ప్లాన్ తనకి తేల్సిపోయిందని, పైగా “Sam, Kelly” ఆల్రెడీ “నిన్ను” మోసం చేయబోతున్నారు అని చెప్తాడు. దాంతో కంగారు పడిన Suzie Kelly ని కలిసి అక్కడ నుండి Sam కి కాల్ చేస్తుంది. Sam అదేమీ లేదని సముదాయిస్తాడు.
తర్వాత Kelly, Sam కలిసి Suzie ని చంపేసి శవాన్ని మాయం చేస్తారు. Suzie కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఒక చోట ఆమె రక్తం, ఊడిపోయిన ఒక పన్ను కనబడటం తో ఆమె చనిపోయిందని నిర్ధారణ చేసుకుంటారు.
కానీ “Kelly” కేసు ఓడిపోవడానికి కారణం “Suzie” కాబట్టి ఆమెని Kelly యే చంపేసింది అని అనుమానిస్తారు. కానీ డిటెక్టివ్ కి Suzie ని చంపేసింది Sam అని అనుమానిస్తాడు. అదే విషయం తన కొలీగ్స్ కి, పై అధికారులకి చెప్తాడు. వాళ్ళు ఇతన్ని ఆ కేసులో వేలు పెట్టద్దని చెప్తారు. కానీ ఇతను వినడు.
ముగ్గురిలో Suzie చనిపోయింది కాబట్టి Kelly కూడా చనిపోయే అవకాశం ఉందని గ్రహించి, ఆమెకి ఆ విషయం చెప్పడానికి డిటెక్టివ్ Kelly ఇంటికి వెళతాడు. కానీ Kelly అపార్థం చేసుకుని డిటెక్టివ్ ని షూట్ చేస్తుంది. ఇతను కూడా సెల్ఫ్ డిఫెన్సు లో షూట్ చేయడం తో ఆమె చనిపోతుంది. దాంతో డిటెక్టివ్ ని డిస్మిస్ చేస్తారు.
ఇక్కడితో రెండో భాగం ముగుస్తుంది.
కట్ చేస్తే నడి సముద్రం మధ్యలో ఒక యాచ్ లో Sam రిలాక్స్ అవుతూ ఉంటాడు, పక్కన డిటెక్టివ్ కూడా ఉంటాడు.
అంటే ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి Kelly ని చంపేసారన్న మాట. Suzie, Kelly ఇద్దరూ చనిపోయారు కాబట్టి ఇక ఉన్న డబ్బు ఇద్దరిదే. కానీ అనుకోకుండా Suzie అక్కడ ప్రత్యక్షమవుతుంది. అంటే ఆమె కూడా బ్రతికే ఉంది. కానీ ఆ విషయం డిటెక్టివ్ కి తెలియదు. దాంతో ఆమెని చూసి షాక్ తింటాడు. అక్కడ Sam, Suzie కలిసి డిటెక్టివ్ ని చంపేస్తారు.
డిటెక్టివ్ చనిపోయాడని నిర్ధారణ అయిన వెంటనే Suzie Sam ని కూడా చంపేస్తుంది.
మెల్లిగా యాచ్ నడుపుకుంటూ ఒడ్డుకు చేరే సరికి అక్కడ ఒక వ్యక్తి సూట్ కేసు నిండా డబ్బుతో ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.
అతనెవరో కాదు. Sam తరపున వాదించిన లాయర్ “Kenneth Bowden”.
దాంతో ఈ కథకి మూల కారణం, ఈ ప్లాన్ అంతా నడిపించింది ఈ లాయర్ అని తెలియడంతో సినిమా ముగుస్తుంది.
మొదటి పేరా లోనే రాసినట్టు ఇదొక ఎరోటిక్ థ్రిల్లర్ కాబట్టి చూసేటప్పుడు జాగ్రత్త.! ఈ సినిమాలో “Kelly” పాత్రలో నటించిన నటి తన కూతుళ్ళు ఇద్దర్నీ ఈ ఈ సినిమా చూడనివ్వలేదట.!
అట్లుంటది ఈ సినిమా తోని.! దీని సీక్వెల్స్ గా మరో మూడు సినిమాలోచ్చాయి కానీ పెద్దగా ఎక్కలేదు.
హాలీవుడ్ లో ఇదో కల్ట్ స్టేటస్ ఉన్న సినిమా.