The Mermaid

ఈ భూమి, సహజ వనరులు కేవలం మనుషులవి మాత్రమే కాదు. వాటిపై మిగతా ప్రాణులకు కూడా భాగం ఉంటుంది..! మనిషి అభివృద్ధి పేరిట చేసే వినాశనం వల్ల మిగతా జంతు జాలాలు ఎలా నాశనం అవుతున్నాయో, దానికి ప్రతీకారంగా ఒక జంతు జాతి ఆ నాశనానికి కారణం అయిన మనిషిని చంపాలని చేసిన ప్రయత్నమే ఈ సినిమా..!

చిన్నప్పటి నుండి చాలా కష్టపడి వ్యాపారం చేసి బాగా ధనవంతుడు అయ్యి, పైకొచ్చిన హీరో ఒక సముద్ర తీర ప్రాంతాన్ని కొని దాన్ని బాగా ధనవంతుల కోసం ఒక ఏమ్యుజ్మెంట్ పార్క్ గా మార్చాలి అనుకుంటాడు..!

కాకపోతే అక్కడ ఉన్న చేపలు, ఇతర సముద్ర జీవులను ఆ ప్రాంతం నుండి తోలేస్తే తప్ప ఆ పని జరగదు…! అందుకని ఆ తీరంలో సముద్రం లోపల “సోనార్ టెక్నాలజీ” ఉపయోగించి కొన్ని తరంగాలను, శబ్దాలను నిరంతరం పంపిస్తూ ఉంటాడు..! అతనికి తెలియని విషయం ఏంటంటే ఆ తీర ప్రాంతంలోనే కొన్ని వేల ఏళ్ల నుండి అటు మనిషి, ఇటు చేప కాని కొన్ని జీవులు బ్రతుకుతూ ఉంటాయి. వాటినే “మెర్మైడ్” లు అంటారు..! అంటే సాహస వీరుడు సాగర కన్య సినిమాలో శిల్పా శెట్టి లా..!

ఆ సోనార్ రేడియేషన్ వల్ల ఆ జీవులకు చర్మ వ్యాధులు, కొన్నిటికి కాన్సర్, మరి కొన్ని చచ్చుపడిపోయి ఉంటాయి..! మిగతావన్నీ ఆ సముద్రంలో ములిగిపోయి, పాడుబడిపోయిన ఒక షిప్ లో ఉంటాయి..! వాటిలో కొన్ని ఈ దారుణానికి కారణం హీరో అని తెలిసి అతడిని చంపడానికి అందంగా ఉన్న ఒక “మెర్మైడ్” ని పంపుతాయి. ఆ మెర్మైడ్ నడుం దాకా మనిషి, కింద అంతా చేప లా ఉంటుంది. ఆ మెర్మైడ్ కి మొప్పల ద్వారా నడవడం, డాన్స్ చెయ్యడం నేర్పి, హీరో రాబోయే ఒక పార్టీకి పంపుతారు…!

కానీ అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల, already హీరోకి ఉన్న బిజినెస్స్ పార్టనర్ అయిన ఒక అమ్మాయి వల్ల హీరోయిన్ కి హీరో ని చంపడం కుదరదు, పైగా తన ఫోన్ నంబర్ ఇచ్చి ఇంటి దగ్గర దింపుతా అని ఇల్లెక్కడ అని అడుగుతాడు..! ఆమె ఇంటికి వెళ్ళే దారిలో ఒక చోట చిన్న ఫెస్టివల్ జరుగుతూ ఉన్నచోట ఆపమని అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది..!

అక్కడ ఆ ఫెస్టివల్ లో ఒక పాట విన్న అతనికి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి..! అంతేకాకుండా డబ్బు కన్నా ఇంకా చాలా ఉన్నాయి అని అనిపిస్తుంది..! అలా ఒక గంట తర్వాత మెర్మైడ్ అతన్ని తన ఇంటికి తీసుకుని వస్తుంది. ఆ ఇంటికి, పాదుబడిపోయిన షిప్ కి వెళ్ళడానికి ఒక రహస్య దారి ఉంటుంది..! కానీ హీరో ఇంటి లోపలకు రాకుండా బయట నుండే వెళ్ళిపోతాడు..! ఇదంతా చూసిన మెర్మైడ్ కి హీరో మంచితనం అర్థం అయ్యి అతన్ని చంపకుండా పరిస్థితి అర్థం అయ్యేలా చెబుదాం అని మిగతా మెర్మైడ్ లతో వాదిస్తుంది. కానీ ఎవరూ ఒప్పుకోరు..!

తర్వాత ఒక రాత్రి హఠాత్తుగా ఆమెతో మాట్లాడాలి అని ఇంటికి వచ్చిన హీరో అక్కడ ఉన్న మెర్మైడ్ లని చూసి ఆశ్చ్యపోయాడు. తప్పించుకు పోదాం అనుకునే లోగా అతన్ని బంధించి షిప్ లోకి తీసుకెళ్ళి అతనికి మొత్తం వివరించి చంపెద్దాం అనుకునే లోగా మెర్మైడ్ అక్కడనుండి తప్పిస్తుంది..!

తన కంపెనీ కి వెళ్ళిన హీరో తన బిజినెస్ పార్టనర్, గర్లఫ్రెండ్ అయిన సెకండ్ హీరోయిన్ కి మొత్తం చెప్తాడు..! అక్కడ పని చేస్తున్న శాస్త్రవేత్తలు సోనార్ వల్ల జరిగే నష్టం అతనికి వివరించడంతో అతనికి తను చేసేది అంతా తప్పు అని అర్థం అయ్యి ఆ పార్క్ ప్రాజెక్ట్ మానెద్దామని నిర్ణయం తీసుకుని ఆమెకు ఆ విషయం చెప్తాడు..!

కానీ తెలియని విషయం ఏంటి అంటే ఆమె చాలా కాలంగా ఈ మెర్మైడ్ ల కోసం చాలా డబ్బు ఖర్చుపెట్టి వెతికిస్తు ఉంటుంది..! వాటివల్ల సముద్రంలో దాగి ఉన్న నిధులు సంపాదించాలి అని ఆమె ఆశ..!

ఆమె అలాగే అని ఒప్పుకొని హీరో కి తెలియకుండా తన రౌడీలను పంపి ఆ మెర్మైడ్ లు అన్నిటినీ బంధించి తెద్దాం అనుకోగా హీరో వచ్చి వాటిని రక్షించడంతో స్టోరీ ఎండ్ అవుతుంది..!

ఈ కథ మొత్తం చెప్పడానికి కారణం ఇదేమి థ్రిల్లర్ కాదు సస్పెన్స్ పోవడానికి. ఇంత సీరియస్ విషయాన్ని చాలా కామెడీగా చెప్పారు…!

హీరోయిన్ నడవడానికి ట్రైనింగ్ తీసుకునే సీన్లు, హీరోని చంపేటప్పుడు, హీరో ని చంపడానికి వెళ్ళిన ఆక్టోపస్ దొరికిపోయి తన తోకలతో తనే వంట చెయ్యడం..! ఫెస్టివల్ లో హీరో తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఏడుస్తూ గుర్తు చేసుకోవడం కూడా కామెడీ యే..!

సినిమా మధ్యలో పిట్టకథ గా సముద్రాన్ని నమ్ముకుని సముద్ర జీవుల ప్రదర్శన శాల పెట్టుకుని ఈ కాలుష్యం వలన సముద్ర జీవులు అంతరించి పోగా వచ్చిన వాళ్ళకు మిగిలిన వాటిని చూపించడం కోసం తాపత్రయ పడే ఒక కుటుంబం..!

కానీ అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ మెర్మైడ్ ని పట్టుకోవడానికి జరిగే ఫైట్..!

మొత్తానికి ప్రకృతి మనిషి ఒక్కడిదే కాదు మిగతా వాటికి కూడా భాగం ఉంటుంది అని చెప్పడంలో మాత్రం సక్సెస్స్ అయ్యాడు..! ఈ సినిమా ఆ సంవత్సరం విడుదల అయిన అన్నిటికన్నా విజయవంతం అయిన సినిమాగా పేరు మాత్రమే కాకుండా డబ్బులు కూడా తెచ్చి పెట్టింది..!