ఈ సినిమా చూడటం మొదలెట్టిన పది నిమిషాలకే అదేంటో ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం వంశీ గారు మోహన్ బాబు ని హీరోగా పెట్టి తీసేసిన “డిటెక్టివ్ నారద” సినిమా గుర్తొచ్చింది…!
85 ఏళ్ల పెద్దాయన, నగరంలో గొప్ప పేరు డబ్బు ఉన్న “హార్లన్” అనే ఒక పబ్లిషర్ తన పుట్టిన రోజు పార్టీ అయిన రాత్రి ఒంటి గంటకు పీక కోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో కథ మొదలవుతుంది..! ( ఆ పీక తనంతట తానే కొసుకోవడం సినిమా మొదట్లోనే చూపించేస్తాడు. కాబట్టి అదేం సీక్రెట్ కాదు)
ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చెయ్యడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ తో పాటు “బ్లాంక్” అనే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కూడా వస్తాడు..! (మన లేటెస్ట్ జేమ్స్ బాండ్ డేనియల్ క్రెగ్)
ఎవరో అతనికి సీక్రెట్ గా ఒక కవర్ నిండా డబ్బు, కేసు గురించి డిటైల్స్ పంపి ఆ కేసు సాల్వ్ చెయ్యమని అప్పగిస్తారు. వాళ్ళెవరో ఆ డిటెక్టివ్ కి కూడా తెలియదు..! కానీ ఆ ఇన్స్పెక్టర్ ఇతనికి ఫ్రెండ్ అవ్వడం వల్ల ఇతనికి ఆ కేసులో దూరడం తేలిక అవుతుంది..!
ఆ పెద్దాయనకు “తల్లి, ఒక కూతురు, ఒక కొడుకు, ఇద్దరు కోడళ్ళు, ఒక మనవరాలు, ఇద్దరు మనవళ్లు, అసిస్టెంట్ గా ఒక నర్సు” ఉంటారు..! (ఇద్దరు మనవళ్లు లో ఒకడు “కెప్టెన్ అమెరికా క్రిస్ ఏవాన్స్”)
పబ్లిషింగ్ కంపెనీ చూసే ఈయన పెద్ద కొడుకు ఈయనకు తెలియకుండా ఈయన రచనల హక్కులు అమ్మెద్దాం అనుకుంటాడు. ఆ విషయం పెద్దాయనకు తెలిసి ఆ పుట్టిన రోజు రాత్రే అతన్ని ఆ కంపెనీ నుండి పీకేస్తాడు..!
పెద్దాయన రెండో కొడుకు 15ఏళ్ల క్రితం మరణిస్తాడు. అతని భార్య “జోని”, మనవరాలు మెగ్. ఆ చిన్న కోడలు కూతురు చదువు పేరు చెప్పి లక్షలు లక్షలు నొక్కేస్తూ ఉంటుంది..! ఆ విషయం తెలిసి ఆ పుట్టిన రోజు నాడే ఇక నీకు దమ్మిడీ కూడా ఇవ్వను, నీ కూతురి చదువు కోసం నీ పాట్లు నువ్వు పడు అని చెప్పేస్తాడు..!
అల్లుడికి ఒక ఎఫైర్ ఉంటుంది. ఆ విషయం తెలిసి తన కూతురితో ఆ విషయం చెప్పి అల్లుడిని బయటకు గెంటేస్తా అని బెదిరిస్తాడు..!
ఆ కూతురి కొడుకు అయిన “పెద్ద మనవడు”(కెప్టెన్ అమెరికా) ఇంట్లో ఎవరితో కలవకుండా ఒక్కడూ ఉంటూ అప్పుడపుడు ఇంటికి వస్తూ డబ్బులు పట్టుకు పోతూ ఉంటాడు. ఆవేళ రాత్రి పెద్దయనతో ఆస్తి కోసం గొడవ పడి “నీ అంతు చూస్తా” ఆని బెదిరించి కోపంగా బయటకు పోతాడు. ఆఖరికి పెద్దాయన అంత్యక్రియలకు కూడా రాడు..!
ఈయనకు రోజూ మందులు ఇచ్చే నర్సు కుటుంబం వేరే దేశం నుండి అమెరికా కు అక్రమంగా వచ్చి నివసిస్తూ ఉంటుంది. ఆ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడుతూ ఉంటుంది..!
ఇక ఇంట్లో పని చేసే మరో వ్యక్తి “ఫ్రాన్” పెద్దాయన మనవరాలితో కలిసి గంజాయి లాంటి సిగరెట్లు దాచుకుని ఇంట్లోనే తాగుతూ ఉంటుంది..!
ఇవన్నీ తెలుసుకున్న డిటెక్టివ్ కి ఇది ఆత్మహత్య కాదేమో హత్య అని అనుమానం వస్తుంది..! ఇక అక్కడ నుండి మనోడు ఇన్వెస్టిగేషన్ మొదలెడతాడు..!
ఆయన ఎలా చనిపోయారు, ఆ డబ్బు సీక్రెట్ గా డిటెక్టివ్ కి పంపింది ఎవరు, కుటుంబ సభ్యులతో పాటు ఆ నర్సుకి, ఆ పని మనిషికి ఆ చావుతో ఉన్న సంబంధం ఎంటి ఇవన్నీ ఖాళీగా ఉన్నప్పుడు amazon లో చూసుకొండి..!
అన్నట్టు ఆ వేనక్కాల ఉన్న కత్తుల సెటప్ కూడా సినిమాలో భాగమే. అది ఎందుకు పెట్టాడో సినిమా ఆఖరి దాకా తెలియదు..!
ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ లో ఉన్న హ్యాపీనెస్ ఏంటంటే సినిమా ఒక పది నిమిషాలు అయ్యాక క్లైమాక్స్ ఊహించేస్తాం.
అనుకున్నది అయితే “అబ్బా..! మనకు ఎన్ని తెలివితేటలో” అనుకోవచ్చు..!
ఒకవేళ కాకపోతే “అబ్బా..! వీడా, ఇదా హత్య చేసింది..!” అని థ్రిల్ ఫీల్ అవ్వచ్చు..!
కాబట్టి స్టోరీ చెప్పేశా (నిజానికి నేను పాత్రల గురించి మాత్రమే చెప్పా) అని కాకుండా హ్యాపీగా సినిమా చూడండి..!