Eternal Sunshine of the Spotless Mind

మరుపు అనేది మనిషికి దేవుడు ఇచ్చిన వరం. అలాగని అన్ని విషయాలూ మర్చిపోడానికి కుదరదు. అలా మర్చిపోయే అవకాశం ఉండి ఉంటే దేవదాసు ఉండడు. పగలు ప్రతీకారాలు, రాత్రులు మౌనంగా ఏడవడాలు ఉండవు.

కానీ ఒకవేళ అలాంటి అవకాశం వస్తే..!

మనకు నచ్చని వాళ్ళను, వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలను చేరిపేసుకుని మళ్ళీ కొత్త జీవితం మొదలెట్టే అవకాశం వస్తే..!

అలాంటి అవకాశం వచ్చిన ప్రేమికులు ఏం చేశారు అన్నది ఈ సినిమా.

Joel (Jim Carrey) ఒకసారి క్లెమెంటెన్ (కెట్ విన్స్లెట్) తో ప్రేమలో పడతాడు.

జోయెల్ ఎవరితోనూ కలవలేడు, సిగ్గరి. కానీ క్లెమెంట్ అలా కాదు. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండే స్వభావం.

అలా ప్రేమలో ఉన్న రెండేళ్ల తర్వాత ఒకసారి గొడవ వచ్చి విడిపోతారు. అలా విడిపోయాక హీరోయిన్ “జ్ఞాపకాలు చెరిపేసే” ఒక కంపెనీని కలిసి హీరోతో తనకున్న జ్ఞాపకాలు అన్నీ మెదడు లో నుండి చెరిపేసుకుని మళ్లీ కొత్త జీవితాన్ని మొదలెడుతుంది.

జోయెల్ కూడా వేరే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ కొన్నిసార్లు పాత జ్ఞాపకాలు మర్చిపోలేక ఆ అమ్మాయి తో గొడవ జరుగుతుంది. అందుకని అవి మెదడులో నుండి తీసేయడం కోసం అదే కంపెనీ నీ కలుస్తాడు.

ఆ కంపెనీ ఫాలో అయ్యే పద్ధతి చాలా సింపుల్. ఒక మనిషితో మీకు ఉన్న రిలేషన్ కి చెందిన వస్తువులు, ప్రదేశాలు, గుర్తులు అన్నీ అడుగుతారు. ప్రతీ జ్ఞాపకం కూడా వేరే ఇంకో జ్ఞాపకానికి లింక్ అయ్యి ఉంటుంది. అలా మెదడులో కొన్ని వేల జ్ఞాపకాల లింకులు ఉంటాయ్. ఆ లింకులు తెగ్గొడితే చాలు.

ఉదాహరణకు మీ మెదడులో కాలేజీ అన్న జ్ఞాపకాలు తియ్యాలి అంటే దానితో లింకు ఉన్న ఫ్రెండ్స్, చేసిన అల్లరి, వెళ్ళిన టూర్లు, చూసిన ప్రదేశాలు ఇలాంటి జ్ఞాపకాలు ఉన్న లింకులు అన్నీ తీసేస్తే ఇక కాలేజీ అనేది మీకు గుర్తుకు రాదు.

మీ తలకు ఒక హెల్మెట్ లాంటి మెషిన్ పెట్టీ ఆ జ్ఞాపకాలు గుర్తు వచ్చినప్పుడు మీ మెదడు కి యే నరాలు ఎక్కువగా స్పందిస్తున్నాయో మొనిటర్ లో చూసి తర్వాత వాటి మధ్య లింకులు తెగ్గొట్టి వాటిని జాగ్రత్తగా చెరిపేస్తారు. తర్వాత ఆ వస్తువులు అన్నీ వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ లాకర్ లో దాచేస్తారు.

హీరో కి ఈ ప్రొసీజర్ చెయ్యడం కోసం అన్నీ రెడీ చేసి పెట్టాక అతనికి మత్తు ఇచ్చి జ్ఞాపకాలు చెరపడం మొదలెడతారు. అయితే మత్తులోకి వెళ్ళిన హీరో మెదడు అలా ఒక జ్ఞాపకం చేరుపుతుంటే అది ఇష్టంలేక చేరిపిన జ్ఞాపకం ప్లేసులో కొత్త జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది. అంటే ఒక విధంగా హీరోకి ఆమెని మర్చి పోవాలి అని ఉండదు.

అలా తెచ్చుకుంటూ ఉన్న ప్రతీ జ్ఞాపకాన్ని వీళ్ళు చేరుపుతూ ఉంటారు. అలా ఒక రెండేళ్లు వెనక్కు వెళ్ళాక హీరోకి ఆమెతో ఒక స్టేజి లో ఇక జ్ఞాపకాలు ఏమీ దొరకక మెదడు రిలాక్స్ అయిపోతుంది. అంటే ఇక హీరో మత్తులో నుండి బయటకు రావాలి.

ఇక జ్ఞాపకాల లింకులు ఏమీ లేవు అని వీళ్ళు ఆ మెషిన్ నీ ఆటో మోడ్ లో పెట్టి పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ లోగా హీరో చిన్నప్పుడు ఎప్పుడో హీరో కూడా మర్చిపోయిన ఒక జ్ఞాపకం మాత్రం బయటకు వస్తుంది. దానివల్ల కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఆ జ్ఞాపకం ఎంటి, మళ్లీ వీళ్ళు ఎలా కలిశారు అనేది మీరు ఊహిస్తున్నట్టు మాత్రం ఉండదు.

ఈ సినిమాలో జ్ఞాపకాలు తీసేసే టెక్నీషియన్ గా వేసింది మార్క్ రఫెల్లో (అవెంజర్స్ లో హల్క్). హీరోకి జ్ఞాపకాలు చేరిపేటప్పుడు తన లవర్ వస్తుంది. ఇద్దరూ కలిసి చేసే డ్యాన్స్ చూడాలి. అదే అసలు ఈ సినిమాకు మెయిన్.

ఇలా మెదడు లో ప్రయోగాలు చేసే సినిమాల్లో inception, మాట్రిక్స్ కన్నా సింపుల్ గా ఈ సినిమా ఉంటుంది. ఎక్కడా కంగారు పడకుండా చాలా జాగ్రత్తగా అందరికీ అర్థం అయ్యేలా తీశారు.

సినిమా అంతా ఏది జ్ఞాపక మో, ఏది నిజమో అర్ధం కావడం కోసం హీరోయిన్ జుట్టుని రంగు రంగులుగా చూపిస్తారు. అంటే ఒక్కో జ్ఞాపకానికి ఒక్కో రంగు విగ్గు.

ఈ సినిమా ఆధారంగానే బి.జయ గారు ప్రేమికులు అని ఒక సినిమా తీశారు. కాకపోతే అక్కడ ఏక్సిడెంట్ జరిగి గతం మర్చిపోతారు.

2004 లో విడుదల అయిన ఈ సినిమాకు డబ్బులు బాగా రావడం మాత్రమే కాదు బెస్ట్ స్క్రీన్ ప్లే, కెట్ విన్స్లెట్ కి బెస్ట్ యాక్ట్రేస్ అవార్డ్ కూడా వచ్చింది.