Negative Trailer

ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ వాల్ మీద ఈ సినిమా ట్రెయిలర్ కోసం చూసిన వెంటనే అసలు ఏముంది అని ఓపెన్ చేసి చూసా.

ఆ లింక్ కాస్తా దగ్గుబాటారి సురేష్ ప్రొడక్షన్స్ అఫిషియల్ యూట్యూబ్ ఛానెల్ కి తీసుకెళ్ళింది. మనకు తెలియకుండా సురేష్ బాబు ఈ సినిమా ఎప్పుడు తీసాడ్రా బాబు అనుకుంటూ ఓపెన్ చేశా. తీరా చూస్తే ట్రైలర్ లో ఒక్క తెలిసిన మొహం లేదు ఒక్క శ్వేతా వర్మ తప్ప. ఆ అమ్మాయి ది ఇది వరకు రాణి అని ఒక సినిమా వచ్చింది తర్వాతాయమ్మాయి బిగ్ బాస్ లోకి వచ్చింది.

హీరో తెలియదు, నిర్మాత తెలియదు, దర్శకుడు అసలే తెలియదు. కానీ ట్రెయిలర్ చూసాక తెలిసిందొకటే. ఈ సినిమా ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉండబోతోంది అని మాత్రమే. (తెలియదు అంటే వీళ్ళు ఎవరూ ఇంతకు ముందు నాకు తెలియదు అని.)

ట్రైలర్ ఓపెన్ లోనే ఒక సీన్ చూసి ఇదేదో మామూలుగా తీసే ఒక చిన్న బూత్ఫుల్ రొమాంటిక్ లాంటి స్టోరీ అనుకున్నా. కానీ మరుక్షణమే చచ్చిపోతా అనే హీరో, పైగా వాడి ఆఖరి కోరికలు గా “ఆల్కహాల్, స్మోకింగ్, సెక్స్” అని బోర్డ్ మీద రాసి మరీ పెట్టుకున్నాడు. కోరికల చిట్టా రాసి మరీ పెట్టుకున్నాడు అంటే చనిపోయేది ఏదో తాత్కాలిక ఎమోషన్ వల్ల కాదన్నమాట.

ఒకసారి ట్రైన్ దగ్గర, ఒకసారి చెయ్యి కోసుకోబోతూ, ఇంకోసారి నిద్ర మాత్రలు మింగుతూ మూడు సార్లు చావడంలో ఫెయిలయినట్టున్నాడు.

మామూలుగా చాలా సినిమాలకు కాన్సెప్ట్ బావుంటే టెక్నికల్ గా ఏదోలా ఉంటుంది. పోనీ టెక్నికల్ గా బావుందంటే కాన్సెప్ట్ ఏమీ ఉండదు. కానీ రెండు విధాలుగా కూడా excellent గా ఉన్న ట్రైలరిది.

ఈ సినిమా తీసిన బాల సతీష్ ఇది వరకు రైటర్ గా తమిళ డబ్బింగు సినిమాలకు స్క్రిప్ట్ లో కూడా పని చేశాడు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు ఒక డజను ఫిల్మ్ ఫెస్టివల్స్ కి నామినేట్ అయింది.

యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ లో సెమి ఫైనలిస్ట్‌గా నిలిచింది. అనటోలియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, కలకారి ఫిల్మ్ ఫెస్టివల్, ది లిఫ్ట్-ఆఫ్ సెషన్స్ ఆన్‌లైన్ & ఫస్ట్ టైమ్ ఫిల్మ్ మేకర్ సెషన్స్ లిఫ్ట్-ఆఫ్ గ్లోబల్ నెట్‌వర్క్, ఫిలమ్ ఇంటర్నేషనల్ స్టోరికల్ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అఫిషియల్ గా సెలక్ట్ అయింది.

అంతే కాకుండా ప్రాగ్‌ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, కోసిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ మరియు బ్రెజిల్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా వేశారు.

https://youtu.be/WzfAckCpq8M
error: Content is protected !!