DJango

ఆధునిక రామాయణం.

అనగనగా ఒక బౌంటీ హంటర్. బౌంటి హంటర్ అంటే పోలీసులకి దొరక్కుండా తప్పించుకు తిరిగే దొంగల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించి వాళ్ళ నుండి డబ్బులు తీసుకునే బ్యాచ్. అంటే ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ టైప్ అన్నమాట.

ఆ బౌంటీ హంటర్ కి ఒక ముగ్గురి దొంగల ఆచూకీ కావాల్సి వస్తుంది. వాళ్ళని పట్టుకుంటే మంచి అమౌంట్ కూడా వస్తుంది. కానీ వాళ్ళ కోసం పూర్తిగా తెలిసింది ఒక హీరోకి మాత్రమే. వాడి పేరు “Django”. (D సైలెంట్.)

అయితే ఈ Django ఒక నల్ల బానిస. అతడిని, అతడి భార్యని విడి విడిగా బానిసల కింద అమ్మేసారు. అలా ఇతడితో పాటూ మరికొంత మంది బానిసలను కొనుక్కున్న ఒక యజమాని అందరికీ గొలుసులు కట్టి తీసుకు వెళుతూ ఉండగా ఈ బౌంటీ హంటర్ ముందు అమ్మమని మర్యాదగా అడిగి ఒప్పుకోక పోతే దాడి చేసి చంపేసి ఆ యజమాని దగ్గర నుండి ఈ Django గొలుసులు తెంపి తప్పిస్తాడు. అదే టైటిల్ లో ఉన్న “Unchained”.

వాళ్ళని పట్టుకోవడం లో సాయం చేస్తే కనక తన బానిసత్వం నుండి విముక్తి ఇస్తా అని బౌంటీ హంటర్ ప్రామిస్ చేస్తాడు. ఇద్దరూ కలిసి “బిగ్ డాడీ” అనే ఒకడి ఫామ్ హౌస్ లో పని చేస్తున్న ఆ ముగ్గుర్నీ చంపేస్తారు.

తన మనుషుల్ని చంపేశారు అని కోపంతో ఆ బిగ్ డాడీ వీళ్ళ మీద దాడి చేయిస్తాడు. ఈ Django ఆ దాడి నుండి బౌంటీ హంటర్ ని కాపాడి బిగ్ డాడీ ని చంపేస్తాడు.

దాంతో కృతజ్ఞత గా బౌంటీ హంటర్ ఈ Django భార్య అయిన “BroomHilda” కాపాడాలని నిశ్చయించుకుంటాడు.

అయితే బానిసలు ఒక యజమాని దగ్గర స్థిరంగా ఉండరు. మంచి రేటు వస్తే ఆ యజమాని వీళ్ళని మరో యజమానికి అమ్మేస్తాడు. అందువల్ల అలా చేతులు మారుతూ ఉంటారు. అలాగే BroomHilda కూడా చాలా చేతులు మారి ఎక్కడ ఉందో తెలియదు.

ఇక ఆమెని వెతుకుతూ ఇద్దరూ ఊళ్లు తిరుగుతూ, మధ్య మధ్యలో దొరికిన దొంగల్ని లేపేసి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. చివరకి ఆమె కెల్విన్ క్యాండీ అనే యజమాని దగ్గర ఉందని తెలిసి అక్కడకి వస్తారు. ఈ కెల్విన్ క్యాండీ గాడు పరమ దుర్మార్గుడు.

అయితే డైరెక్ట్ గా ఆమెని అమ్మమంటే ఆ క్యాండీ గాడు కొండెక్కి కూర్చుని లక్షలు చెప్తాడు. అందుకని ఈ క్యాండీ గాడి దగ్గర ఫైటర్ లు చాలా మంది ఉంటారు. ఈ ఫైటర్ లు కూడా బానిసలే. పోటీల్లో పాల్గొని చచ్చే దాకా ఫైట్ చెయ్యాలి.

ఒక ఫైటర్ ని కొనుక్కుని, కొసరు కింద ఆమెని వందకో, వెయ్యికో అడగాలి అన్నది వీళ్ళ ప్లాన్. కానీ అనుకోకుండా డిన్నర్ చేసేటప్పుడు ఆమె Django కి తెలుసు అని అర్థం అయిపోతుంది. దాంతో ఆమెను పంపను అని మెలిక పెట్టి ఒకవేళ పంపాలి అంటే చాలా డబ్బు కావాలి అంటాడు.

Django, బౌంటీ హంటర్ ఇద్దరూ ఒప్పుకుంటారు. బౌంటీ హంటర్ డబ్బులిస్తాడు. కెల్విన్ క్యాండీ గాడు ఆమెని వీళ్లకు ఇచ్చినట్టు పేపర్స్ కూడా ఇచ్చేస్తాడు. అంటే ఆమె బానిసత్వం నుంచి విముక్తి అయిపోయింది.

సరిగ్గా అంతా బావుంది అనుకునే సరికి ఇద్దరికీ చిన్న గొడవ వచ్చి మాటా మాటా పెరిగి కాల్పులు జరిగి ఆ కెల్విన్ క్యాండీ గాడు, ఈ బౌంటీ హంటర్ ఇద్దరూ ఛస్తారు.

దాంతో Django రెచ్చిపోయి మొత్తం అక్కడ ఉన్న రౌడీ బ్యాచ్ ని లేపెస్తాడు. కానీ ఒకళ్ళు BroomHilda ని ఎత్తుకోపోవడం తో ఇతనికి లోంగిపొక తప్పదు.

ఇక అక్కడ నుండి ఎలా తప్పించుకున్నాడు.?
పెళ్ళాన్ని ఎత్తుకు పోయింది ఎవరు.?
మొగుడూ పెళ్ళాల కి బానిసత్వం నుండి పూర్తి విముక్తి దొరికిందా.?

ఇవన్నీ సినిమాలో చూడండి.

టొరంటినో అన్ని సినిమాల్లో లాగానే దీన్లో కూడా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ హఠాత్తుగా గన్నులు తీసి కాల్చేసుకుంటారు.

ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్ Django కెల్విన్ క్యాండీ గాడి ఫామ్ హౌస్ కి వచ్చినపుడు “BroomHilda” ని ఒక పెట్టె లో నుండి బయటికి తీస్తారు. ఆ సీన్ నెట్ లో వెతికి చూడండి. కనీసం మూడు నాలుగు సార్లు చూస్తారు.
Django unchained The Hot Box అని కొట్టండి.

ఇక Django గా చేసిన Jamie Foxx,
Bounty hunter గా చేసిన Chirstoph Waltz,
కెల్విన్ క్యాండీ గా చేసిన “లియోనార్డో డికప్రియో”,

ఎవ్వరూ తక్కువా కాదు, ఎక్కువా కాదు అన్నట్టు ఉంటుంది.

FB లో చాలా పాపులర్ అయిన డికాప్రియో meme ఈ సినిమాలోని డిన్నర్ సీన్ దే.

తన పెళ్ళాన్ని ఎత్తుకు పోయిన రావణుడు లాంటి కెల్విన్ క్యాండీ గాడి నుండి, సుగ్రీవుడు లాంటి బౌంటి హంటర్ సాయంతో రాముడి లాంటి Django ఎలా తెచ్చుకున్నాడు అన్నదే ఈ సినిమా.

కింద ఫోటో లో దూరంగా పెళ్ళాం ఉన్న హాట్ బాక్స్ ని ఏమీ చేయలేక దీనంగా చూస్తూన్న హీరో.