HidimbaHidimba

నవరసాల్లో ఎక్కువ మంది ఇష్టపడేది, అందరూ కలిసి చూడగలిగేది హాస్యం అయితే, పెద్దలు మాత్రమే చూడగలిగేది శృంగారం, భీభత్సం.

శృంగారం బేస్ మీద స్టార్ హీరోల పెద్ద సినిమాల నుండి, కొత్తగా వచ్చిన చిన్న సినిమాల వరకూ అందరూ తీసేశారు. ఎందుకంటే అది తీయడం కొద్దిగా సులభం, పైగా సేఫ్ గేమ్. కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేసేసి, మరి కొన్ని షాట్స్ కట్ చేసేస్తే హాయిగా సకుటుంబ సపరివార సమేతం గా చూసే ఫ్యామిలీ డ్రామా అయిపోతుంది.

కానీ చాలా తక్కువ మంది టచ్ చేసిన జానర్ ఈ భీభత్స రసం పైగా రిస్క్. భీభత్స కాన్సెప్ట్ లో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఎందుకంటే ఆ సీన్స్, షాట్స్ కట్ చేసేస్తే స్టొరీ మారిపోయి సినిమా ఫీల్ పోతుంది. కాబట్టి ప్రతీ సీన్, షాట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఈ జానర్ అందరూ టచ్ చెయ్యరు. అందుకే దండుపాళ్యం లాంటి “రా” సినిమాలు అన్ని సార్లూ రావు. అలాంటి ఒక రేర్ జానర్ లో వచ్చిన సినిమాయే ఈ హిడింబ.

సిటీ లో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. హీరో అభయ్ ఎన్ని సార్లు ఆ కేసులో ముందుకు వెళదాం అని చూసినా అతని పై అధికారి దుర్యోధన్ ఏదో ఒక కారణం చెప్పి అడ్డు పడుతూ ఉంటాడు. DGP కి దుర్యోధన్ విషయం తెలియక అభయ్ సరిగ్గా డీల్ చేయడం లేదని ఆద్యా అనే ఒక స్పెషల్ ఆఫీసర్ ని ఈ కేసు కోసమే దింపుతాడు.

అభయ్, ఆద్యా కలిసి వర్క్ చేయడం మొదలు పెడతారు.

అప్పటి దాకా అభయ్ సరిగ్గానే కేసు డీల్ చేశాడనీ, కానీ పై అధికారుల వల్ల ముందుకు వెళ్లలేదని, తెలుస్తుంది.

మొత్తానికి ఇద్దరూ కలిసి “బోయా” అనే ఒక గ్యాంగ్ ని అరెస్ట్ చేసి అతను కిడ్నాప్ చేసిన అమ్మాయిలని విడిపిస్తారు. ఇక్కడే ఒక విషయం తెలుస్తుంది.

వీళ్ళు విడిపించిన అమ్మాయిలు వేరే, వీళ్ళు డీల్ చేసే కేసులో అమ్మాయిలు వేరే. కేసు మళ్లీ మొదటికి వస్తుంది.

అనుకోకుండా దొరికిన ఒక లింక్ వల్ల ఈ కేసుకు చాలా పురాతనమైన “హిడింబ” అనే ఒక తెగకు సంబంధం ఉందని తెలుస్తుంది.

మిగతా చెప్తే ఇక థ్రిల్ పోతుంది. కాబట్టి చెప్పడం లేదు.

తెలుగు లో చాలా తక్కువ సినిమాలు వచ్చే జానర్ లో వచ్చిన సినిమా ఇది. కథ ప్రకారం మొదటి సగం రొమాంటిక్ యాక్షన్ కామెడీ తో సరదాగా సాగితే, రెండో సగం మొత్తం ఎక్కడా బుర్ర తిప్పుకొనివ్వదు.

ఇప్పటి దాకా పక్కింటి కుర్రాడి గా సింపుల్ గా ఉన్న “యాంకర్ ఓంకార్ తమ్ముడు” కాస్తా “అశ్విన్ బాబు” గా కంప్లీట్ మేకోవర్ అయిన సినిమా ఇది.

ఈ సినిమా కున్న మెయిన్ అసెట్ లో అతను చేసిన ఫైట్స్ కూడా ఒకటి.

పూరీ గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పినట్టు “హీరో ఎంతమందిని కొట్టాలి” అన్నది జనాలు డిసైడ్ చేస్తారు. ఇతను ఇంత మందిని కొట్టచ్చు అని వాళ్ళు పర్మిషన్ ఇస్తారు.

ఈ సినిమాలో హీరో బాడీ లాంగ్వేజ్, చేసిన ఫైట్స్ చూస్తే అశ్విన్ బాబు కి ఒక పది పదిహేను మంది రౌడీ లని కొట్టే ఛాన్స్ ఇచ్చారు అనిపిస్తుంది.

ఈ మెకోవర్ క్రెడిట్ అంతా తన హీరో ఎలా ఉండాలో సరిగ్గా ఊహించిన దర్శకుడి Aneel krishna Kanneganti గారికి, దరకుడ్ని నమ్మి కష్టపడిన అశ్విన్ బాబు కి సమానంగా ఇవ్వాలి. రాజుగారి గది సిరీస్ లో పక్కింటి కుర్రాడి గెటప్ కి, #Hidimba లో పోలీస్ గా చేసిన మనిషికి బాడీ కీ, బాడీ లాంగ్వేజ్ కీ చాలా తేడా చూపించాడు.

హీరోయిన్ నందితా శ్వేత నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలా.?

బ్లఫ్ మాస్టర్ లో అమయకపు అమ్మయిగాచేసినా,

ఎక్కడకి పోతావు చిన్నవాడా లో దయ్యం గా చేసినా,

అక్షర లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేసినా

ఎక్కడా పేరు పెట్టలేం.

పాటలు కూడా అడ్డం రాకుండా అవసరం అయిన మేరకు రెండు పాటలు మాత్రమే పెట్టారు. మ్యూజిక్ వికాస్ బడిస, లిరిక్స్ Virinchi Putla

కేరళ ఎపిసోడ్ లో వచ్చిన లోకేషన్స్, ఆ ఫోటోగ్రఫీ నిజంగా మిమ్మలిని వేరే చోటికి తీసుకు వెళ్ళడం ఖాయం.

సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ కేరళా ఎపిసోడ్, ఇంటర్వెల్ మరియు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు చూసిన వాళ్ళు ఎవరూ రివీల్ చేయకండి.

చాలా రోజులకు “I saw the devil, wrong turn” లాంటి మంచి “భీభత్స” మైన కాన్సెప్ట్ తో ఒక సినిమా వచ్చింది అని మాత్రం కచ్చితంగా చెప్పచ్చు.

error: Content is protected !!