Detective Dee

ఒక మహిళ ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి అయితే అది నిలబెట్టుకోవాలి అని చేసిన కుట్రలు, చేయించిన హత్యలు..!

ఆ హత్యలు ఎవరు చేశారో కని పెట్టడానికి 8 ఏళ్ల క్రితం తనే రాజ ద్రోహం కింద కారాగారం లోకి తోయించిన డిటెక్టివ్ ని మళ్ళీ తనే బయటకు రప్పించి అతనికే ఆ కేసులు అప్పగించడం..!

ఈ సినిమాలో టైటిల్ రోల్ చేసిన andy lu వచ్చి ఆ క్యారక్టర్ కోసం క్రిమినల్ సైకాలజీ బుక్స్ చదివాడు..! ప్రత్యేకంగా ఒక సైకాలజిస్టు ఈ సినిమా మొత్తం అతని కూడా ఉన్నాట్ట..!

సినిమా కథ క్రీ శ 689 లో మొదలవుతుంది..! మగ వారసులు లేని రాజ్యానికి చక్రవర్తిని అయ్యాక తన పేరు నిలుపు కోవడం కోసం దాదాపు 1000 అడుగుల ఎత్తైన ఒక బుద్ధుడి విగ్రహాన్ని నిర్మిస్తుంది..! విగ్రహం అంటే హుసేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం లా కాకుండా “లైట్ హౌస్ లా, లేదా ఈఫీల్ టవర్ లా లోపలి నుండి మెట్లు ఉండి విగ్రహం కళ్ళ దగ్గర నిలబడి ఆ సిటీ అంతా చూడచ్చు..!

దాన్ని ఇన్స్పెక్షన్ చెయ్యడానికి వచ్చిన ఇద్దరు అధికారుల్లో ఒకరు అనూహ్యంగా శరీరంలో నుండి మంటలు (నిప్పు) పుట్టి ఆ విగ్రహం పైనే చనిపోయి బూడిద మాత్రం మిగులుతుంది..!

ఆ బూడిదను పరిశీలించిన రాజ వైద్యుడు అధికారి లోపలకు వచ్చాక మాత్రమే విష ప్రయోగం జరిగిందని తెలపడంతో అక్కడ ఉన్న సైన్యాధికారి అక్కడ ఉన్న పని వాళ్లందరినీ అరెస్ట్ చెయ్యబోగ ఒక వ్యక్తి మాత్రం అనుమానాస్పదం గా కనబడడం తో అతని మెడ మీద కత్తి పెట్టీ పెట్టగానే అతను భయపడి ఆ అధికారి విగ్రహానికి కట్టిన ఒక పవిత్ర వస్త్రం లాగడం వల్లే శాపం తగిలి చనిపోయాడని చెప్తాడు..!

అది నమ్మని ఇంకో అధికారి కూడా ఆ విగ్రహానికి ఉన్న ఇంకో వస్త్రాన్ని కూడా లాగేసిన మరు నిమిషంలోనే అదే విధంగా శరీరంలో నిప్పు పుట్టి మసి అయిపోయి బూడిద మిగులుతుంది..!

ఈ సమాచారం విన్న చక్రవర్తిని సభకు వెళుతుండగా ఒక “మాట్లాడే జింక”( అవును నిజం జింకే, ముసుగేసుకున్న మనిషి కాదు) వచ్చి ఆ కేసును “డిటెక్టివ్ డి” కి అప్పగించమని చెప్పి వెళ్లిపోతుంది..! అక్కడ ఆ జింక ను చాప్లిన్ అని పిలుస్తారు..!

వెంటనే చక్రవర్తిని తన అనుచరురాలు, అంగ రక్షకి అయిన హీరోయిన్ కి “డి” ని తీసుకు రమ్మని పంపుతుంది..! తీసుకుని రాడానికి వెళ్లెలోగా అక్కడ జైల్ లో ఉన్న “డీ” మీద హత్యా యత్నం జరుగుతుంది..!

అక్కడ అతన్ని రక్షించి రాజభవనం కు తీసుకువచ్చాక అతనికి కేసును అప్పగించి మొదట ఉన్న సైన్యాధ్యక్షుడు నీ, తన అనుచరురాలిని అతనికి సహాయంగా పంపుతుంది..!

ఈ ఇన్వెస్టిగేషన్ లో ఈ హత్యలన్ని చేస్తున్నది “చక్రవర్తిని” అని “డీ” కి తెలుస్తుంది..!

ఆ కుట్రలన్ని చేదించి రాజ్యాన్ని అసలు వారసులకు అప్పగించడం మిగతా కథ..!

బేసిగ్గా చైనా వార్ కథలు, సినిమాలు అన్నీ “టాంగ్ డైనాస్టి” కాలం లో జరుగుతాయి. చైనాని అతి ఎక్కువ కాలం అంటే దాదాపు 300 యేళ్లు పాలించిన రాజవంశం ఆట అది..!

One of the fiction movie based on “Tang Dynasty” after super hit movies “Hero”, “Red Cliff”, “Curse of golden flower”, “House of flying daggers”..!