సైన్స్ ఫిక్షన్ సినిమాగా మొదలైన ఈ సినిమా మెల్లిమెల్లిగా మనిషి ప్రకృతికి చేస్తున్న ద్రోహం, ఆ ద్రోహం నుండి పుట్టిన ఆత్యాశ, ఆ అశని కార్పొరేట్ కంపెనీలు ఎలా సొమ్ము చేసుకుంటున్నాయి, అక్కడ నుండి మనుషుల మధ్య అంతస్తుల తేడాలు, అక్కడ నుండి మానవ సంబంధాలు మీదకు వచ్చి ముగుస్తుంది.
ప్రతీ మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది.
(ఈ వాక్యం అండర్ లైన్)
ప్రపంచంలో అధిక జనాభా వల్ల కాలుష్యం పెరిగి, వనరులు తరిగిపోతున్నప్పుడు “జోర్గాన్” అనే శాస్త్రవేత్త ఒక పరిష్కారం కనిపెడతాడు. అదే ఇప్పుడు ఉన్న “ఆరడుగుల” మనిషిని కాస్తా కేవలం “అయిదు అంగుళాల మరుగుజ్జు” సైజుకి తగ్గిస్తే ఉన్న వనరులు మరో 80000 వేల సంవత్సరాల కు సరిపోతాయి అని లెక్కలు వేస్తాడు.
కొన్ని సంవ్సరాలపాటు కృషి చేసి అలా మనిషిని ఒక ఆపరేషన్ ద్వారా సైజ్ తగ్గించే పద్ధతి కనిపెడతాడు. ఆ ప్రయోగం విజయవంతం అయ్యి ఒక కార్పొరేట్ కపెనీలకు కాసులు కురిపించే మార్గం కనపడుతుంది.
అవి ఆ పద్ధతిని కాస్తా హఠాత్తుగా మీరు ధనవంతులు అయిపోవచ్చు అన్న విధంగా ప్రకటనలు తయారు చేసి జనాన్ని ఆకర్షించడం మొదలెడతాయి.
ఎలా అంటే మీ దగ్గర ఒక పది లక్షల రూపాయలు ఉన్నాయి అనుకుందాం దానితో మీరు మీ వంటి నిండా సరిపోయే బంగారం కొనలేరు. అదే మీరు మరుగుజ్జు లాగా మారిపోతే మీ శరీరం చిన్నది అయిపోయింది కాబట్టి కేవలం వెయ్యి రూపాయలతో ఏడు వారాల నగలు చేయించుకోవచ్చు.
అలాగే మీ కుటుంబం అంతా బ్రతకడానికి ఒక ఎకరం స్థలంలో విల్లా కట్టుకోవడం చాలా ఖర్చు. అదే మీరు సైజ్ తగ్గితే మీరు కేవలం ఒక 100 గజాల స్థలం లో మూడు నాలుగు విల్లాలు కట్టుకోవచ్చు.
అలాగే మీరు సర్జరీ చేయించుకొని చిన్నగా మారేటప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బుని బట్టి మిమ్మల్ని ఏ కాలనీలో (ధనవంతుల, మధ్య తరగతి) పెట్టాలా అన్నది కూడా ముందే నిర్ణయిస్తారు. ఆ కాలనీల్లో అన్నీ వీళ్ళ సైజుకు తగ్గట్టు చిన్న ఇళ్లు, రోడ్లు, నదులు, వాహనాలు, బార్లు, మాల్స్ ఒకటేమిటి అన్నీ అక్కడే ఉంటాయి. కాకపోతే చిన్న సైజుల్లో.
హీరో తనకున్న అప్పుల బాధ పడలేక ఆస్తులు అమ్మేసి అప్పులు తిర్చేసి పెళ్ళాంతో సహా మరుగుజ్జు గా మారిపోదాం అనుకుంటాడు. ఇతనికి సర్జరీ అయ్యాక ఇతనికి ఒక ఫోన్ వస్తుంది. అది ఇతని పెళ్ళాం దగ్గరనుండి. ఆమె అలా మారడం ఇష్టం లేదు అని, అందుకని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతున్నా అని. కొన్నాళ్లకు ఇతనికి విడాకులు ఇచ్చేస్తుంది.
ఇక చేసేది ఏమీ లేక అలా ఒంటరిగా ఆ కాలనీలో కొన్నాళ్ళు ఉంటాడు. ఇతనికి ఇచ్చింది ధనవంతుల కాలనీ. కాబట్టి అక్కడ అతనికి అన్ని పనులూ చెయ్యడానికి మరుగుజ్జు మనుషులు ఉంటారు.
కానీ ఒక్కడే కాబట్టి ఒక అపార్ట్మెంట్ కి మారిపోతాడు. అక్కడ అతనికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది.
సరే అసలు వీళ్ళు అలా మారిందే సుఖపడడానికి కదా. మరి వీళ్ళకు చాకిరీ చేసేది ఎవరు..?
దానికోసం కొంతమంది పేద వాళ్ళను కూడా అలాగ మరుగుజ్జు ల్లాగా మార్చి వీళ్ళకు పని మనుషుల కింద తీసుకువస్తారు. ఇతనికి పరిచయం అయిన అమ్మాయిని అలా నార్వే నుండి తీసుకువస్తారు. హీరో ఉండే ధనవంతుల కాలనీకి దూరంగా ఉండే బస్తీ లాంటి ఏరియాలో ఈ అమ్మాయి ఉంటుంది. వాళ్ళకు అక్కడ నుండి ఒక మినియెచ్చర్ బస్సు ఉంటుంది. దానిలో రోజూ ఈ కాలనీలకు వచ్చి పని చేసి వెళ్లిపోతూ ఉంటారు.
ఇద్దరికీ పరిచయం పెరిగి, ఇతని ఇద్దరి ఫ్రెండ్స్ ఒకసారి సరదాగా నార్వే ట్రిప్ కి వెళుతుంటే నేను కూడా వస్తా అంటుంది.
(ఇలాంటి మినియేచర్ కాలనీలు ప్రపంచంలో ఇంకా చాలా చోట్ల ఉంటాయి. అలాంటి వాటిలో నార్వే ఒకటి. వీళ్ళు ఎక్కడికి వెళ్లాలి అన్నా కూడా ఒక చిన్న విమానం లో ఆ దేశానికి ప్రయాణం చేసేస్తారు. వీళ్ళ వస్తువులు కొరియర్ లో వస్తాయి.)
అలా నార్వే వెళ్ళాక అప్పటి దాకా ఉన్న ఇతను ఇప్పటిదాకా జీవితం కోసం ఆలోచించిన విధానం తప్పు అని తెలుసుకుని ఏం చేశాడు అనేది మిగతా కథ.
బేసిగ్గా మనకు సైన్స్ ఫిక్షన్ కథలు అనగానే గ్రాఫిక్స్, అవీ ఊహించుకుంటాం. కానీ ఈ సినిమా ఒక అరగంట తర్వాత మనకు ఆ విషయం గుర్తుకు రాదు. ఏదో ఒక మామూలు ధనవంతుల, బీదా బిక్కీ జనాల మధ్య జరిగే సంఘటనలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
Matt Damon hero గా 2017 లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ మనం రోజూ చూసే విషయాలను కొత్తగా చెప్తుంది.
Note: సినిమా అంతా సూపర్ ఉంటుంది. కానీ ఏదో లింక్ కట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఏదైనా సీన్లు ఎడిటింగ్ లో లేపేసాడమో అని నా డౌట్.