Saving Private Ryan

మీరెప్పుడైనా ఎవరికైనా సాయం చేశాక, లేదా చెయ్యబోయే ముందు “ఈ సాయానికి ఆ వ్యక్తి నూటికి నూరు శాతం అర్హుడు. అపాత్ర దానం కాదు” అని అనిపించిందా..! ఈ సినిమాలో హీరో “జాన్ మిల్లర్” కి అనిపించింది..!

1944 జూలై 6 న రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా దళాలు జర్మనీ ఆక్రమిత ఫ్రాన్స్ (ఒమాహ బీచ్) సముద్ర తీరంలో యుద్ధం చెయ్యడానికి అడుగుపెట్టడం తో కథ మొదలవుతుంది.

ఆ తీరాన్ని తమ అధీనంలోకి తీసుకోవడం కోసం జరిగిన ఒక యుధ్దం లో కొన్ని వందల మంది సైనికులతో బాటు ర్యాన్ అనే సైనికుడు కూడా చనిపోతాడు..! మొత్తానికి ఆ తీరం అమెరికా ఆధీనంలో కి వస్తుంది..!

యుధ్దం లో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ఆర్మీ చీఫ్ ఒక లేఖ పంపడం ఆనవాయితీ. ఆ లేఖ పంపేటప్పుడు ఒక మహిళకు ఒకేసారి మూడు ఉత్తరాలు పంపాల్సి వస్తుంది. అంటే ఆమె ముగ్గురు కొడుకులు ఒకేసారి యుద్ధం లో చనిపోయారు..! ఈ విషయం గ్రహించిన ఒక టైపిస్ట్ పై అధికారులకు ఈ విషయాన్ని చేరవేస్తుంది..!

ఆమె ఆఖరి కొడుకు “జేమ్స్ ర్యాన్” కూడా అమెరికా తరుపున యుధ్దం లో పాల్గొంటున్నాడు. ఎలాగైనా అతడు చనిపోకుండా కనీసం అతన్ని అయినా అతని తల్లి దగ్గరకు క్షేమంగా చేర్చాలి అని ఆర్మీ చీఫ్ నుండి ఈ దళానికి ఆదేశం వస్తుంది..! కాకపోతే అతను ఉన్న సైనిక పటాలం చాలా దూరం లో సందేశం పంపడానికి వీలు లేని చోట ఉండటంతో ర్యాన్ ని అక్కడ నుండి తీసుకు రమ్మని హీరోని, అతనికి సహాయంగా ఇంకో ముగ్గురినీ పంపుతారు..!

ఇక అక్కడనుండి హీరో ర్యాన్ ని కలిసాడా, అసలు ఆ ర్యాన్ ఎవరు, ఎలా కలిశాడు, కలిసిన తర్వాత ఏం జరిగింది అనేది ఒక్కనిమిషం కూడా వేస్ట్ కాకుండా మిగతా రెండు గంటల సినిమా..!

రెండు గంటల నలభై నిమిషాలు సినిమాలో మొదటి అరగంట, ఆఖరి అరగంట, మధ్యలో ఒక అరగంట “యుద్ధమే” ఉంటుంది…!

యుధ్దం అంటే అదేదో దేశభక్తి రంగరిస్తూ, స్ఫూర్తిని కలిగిస్తూ మనం కూడా యుద్ధం చేసేయాలి అనేలా మాత్రం ఉండదు..!

యుధ్దం లో, మనం లేదా మనవాళ్ళు “చచ్చినా”
ఉండకూడదు. అసలు ఈ యుద్ధం లేకపోతే ఎంత బావుంటుందో అనేలా ఉంటుంది..!

మచ్చుకి 3 సన్నివేశాలు చెప్తా..!
ఒకచోట గాయ పడిన ఒక సైనికుడిని వేరొక సైనికుడు లాక్కుంటూ వెళుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే బాంబు పడి ఆ గాయపడిన సైనికుడి నడుం దగ్గర శరీరం రెండు గా విడిపోతుంది..!

ఒక చోట అయితే ఒక సైనికుడు తెగిపడిన తన చెయ్యిని పట్టుకుని పరుగెడుతూ ఉంటాడు..!

ఇంకో చోట ఒక సైనికుడికి తుపాకీతో తూట్లు పడుతుంది. అతని ముందు భాగం లో నాలుగు బుల్లెట్లు దిగుతాయి. ముందు నుండి రక్తం ఆపలేనంతగా కారిపోతూ ఉంటుంది. అతనికి నెప్పి తెలియకుండా మెడిసిన్ ఇస్తారు. అతను నా వీపు మీద ఏదైనా బుల్లెట్ దిగిందా? రక్తం పోతోంది అని అడుగుతాడు..!

ఇంకో చోట తను చనిపోయే ముందు ఒక లెటర్ ఇచ్చి తన తండ్రికి ఇమ్మని ఒక సైనికుడు అడిగే సన్నివేశం..!

నిజంగా యుద్ధం వస్తె మనకు సినిమాల్లో చూపించినంత గ్లామరస్ గా ఉండదు అనేది ఈ సినిమా ద్వారా చూపించాడు..!

ఈ సినిమా అంతా హీరో దాదాపు “సింగిల్” కాస్ట్యూమ్ తోనే ఉంటాడు..! దాదాపు 54 సంవత్సరాల స్పాన్ ఉన్న కథ, వారం రోజులు జరిగే కథ..!

జురాసిక్ పార్క్ ద్వారా మనకు బాగా తెలిసిన దర్శకుడు స్పీల్ బర్గ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాగా “Tom Hanks, Matt Damon” ఇద్దరూ మెయిన్ లీడ్స్..!

1998 ఆస్కార్ లో బెస్ట్ డైరెక్టర్ తో పాటు, బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్ గెలుచుకుంది..!

(బెస్ట్ యాక్టర్ గా Tom Hanks పోటీ పడినప్పటికీ, “రాబర్తో బెంజిని” అనే ఇటాలియన్ నటుడు “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” అనే ఇటాలియన్ సినిమా ద్వారా పట్టుకు పోయాడు. (అదే ఆ సినిమాయే, మన త్రివిక్రమ్ గారు చిరునవ్వుతో సినిమాలో పెట్టిన ఐస్ క్రీం, టోపీ, హీరోయిన్ కోసం సినిమాకి వెళ్ళే సీన్లు లేపేసిన సినిమాయే).

ఈ సినిమాలో అబ్రహాం లింకన్ అమెరికాలో జరిగిన సివిల్ వార్ లో “అయిదుగురు” పిల్లలను పోగొట్టుకున్న ఒక మహిళకు రాసిన ఉత్తరంలో మాటలను అలాగే వాడుకున్నారు..!

రెండో ప్రపచయుద్ధం నేపథ్యంలో లేదా ఆ పీరియడ్ వచ్చిన సినిమాల్లో ఈ కింద చెప్పిన మిగతా మూడు సినిమాలు చూడటం మర్చిపోవద్దు..!